Zomato: డెలివరీ బాయ్స్ కు జొమాట్ గుడ్ న్యూస్

Zomato: డెలివరీ బాయ్స్ కు జొమాట్ గుడ్ న్యూస్

జొమాటో.. డెలివరీ బాయ్ ల అవసరాలను తీర్చేందుకు ‘ది షెల్టర్ ప్రాజెక్ట్’ అనే కాన్సెప్ట్ ను తీసుకొచ్చింది. వీటినే రెస్ట్ స్టాప్ లు అని కూడా అంటారు. ఈ షెల్టర్ స్టాప్ లో ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ లు విశ్రాంతి తీసుకోవచ్చు. ‘ప్రతీరోజు కస్టమర్ల ఆకలి తీర్చడంలో డెలివరీ బాయ్స్ కీలక పాత్ర పోషిస్తారు. వాతావరణం ఎలా ఉన్నా అనుకున్న సమయానికి డెలివరీ చేస్తారు. మా సిబ్బంది శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని ది షెల్టర్ ప్రాజెక్ట్ ని ప్రారంభించామ’ని జొమాటో సీఈఓ దీపెందర్ గోయల్ అన్నారు. 

ఇందులో భాగంగా జొమాటో ఉన్న నగరాల్లో డెలివరీ బాయ్స్ కోసం కొన్ని రూమ్స్ నిర్మించనున్నారు. అందులో సోఫా, నీళ్లు, టాయిలెట్స్, ఇంటర్నెట్, ఛార్జింగ్ పాయింట్స్ లాంటి సౌకర్యాలతో పాటు, ఫస్ట్ ఐడ్ కిట్స్, కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి.  డెలివరీ చేస్తూ అలసిపోతే ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకోవచ్చు. జొమాటో తీసుకున్న ఈ నిర్ణయానికి సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.