మ‌హిళా ఉద్యోగుల‌కు నెల‌స‌రి సెలవులు : సిగ్గుప‌డొద్దంటూ సీఈఓ స‌ల‌హా

మ‌హిళా ఉద్యోగుల‌కు నెల‌స‌రి సెలవులు : సిగ్గుప‌డొద్దంటూ సీఈఓ స‌ల‌హా

మొహ‌మాటం, సిగ్గుప‌డ‌కుండా నెల‌స‌రి లీవ్ తీసుకోండి అంటూ సీఈఓ దీపింద‌ర్ గోయ‌ల్ ట్వీట్ చేశారు.

జోమాటో త‌న సంస్థ‌లో ప‌నిచేస్తున్న మహిళ‌లు మరియు ట్రాన్స్ జెండ‌ర్స్ కు నెల‌స‌రి లీవ్ ప్ర‌క‌టించింది. నెల‌స‌రి టైమ్ లో రెస్ట్ తీసుకునేలా లీవ్ ఇవ్వ‌నుంది. ఇందుకోసం ఉద్యోగులు పీరియ‌డ్స్ లీవ్ అప్ల‌య్ చేసుకోవాలి. ఆ విష‌యంలో మ‌హిళా ఉద్యోగులు సిగ్గు, మొహ‌మాటం లేకుండా లీవ్ తీసుకోవాలంటూ జోమాటో సీఈఓ దీపింద‌ర్ గోయ‌ల్ ఉద్యోగులకు మెయిల్ చేశారు.

అయితే జోమాటో తీసుకున్న నిర్ణ‌యం పై మ‌హిళా ఉద్యోగులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. దీనిపై నెటిజ‌న్లు మ‌ద్దతు ప‌లుకుతున్నారు. పీరియ‌డ్స్ లీవ్స్ పై పెద‌వి విరుస్తున్న‌వారు..నెల‌స‌రి స‌మ‌యంలో మ‌హిళ‌లు ఎలాంటి స‌మ‌స్య‌ల్ని ఎదుర్కొవాల్సి వ‌స్తుందో తెలుసుకోవాల‌ని స‌ల‌హా ఇస్తున్నారు.

పీరియ‌డ్స్ టైంలో మ‌హిళ‌ల ఆరోగ్యం ఎలా ఉంటుందంటే

సైంటిస్ట్ లు జ‌రిపిన అధ్య‌యనాల్లో నెల‌స‌రి స‌మ‌యంలో మ‌హిళ‌ల‌కు తీవ్ర‌మైన నొప్పితో బాధ‌ప‌డ‌తార‌ని, ఆ నొప్పి గుండె పోటుకంటే తీవ్రంగా ఉన్న‌ట్లు తేల్చారు.

డిస్మెనోరియా, ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్స్ లేదా పీసీఓడీ వంటి స‌మ‌స్య‌ల‌తో మ‌హిళ‌ల‌కు తీవ్ర‌మైన ర‌క్త‌స్రావం, క‌డుపునొప్పి, తిమ్మిరికి కార‌ణ‌మ‌వుతున్న‌ట్లు నిర్ధారించారు.

అంతేకాక, పీరియడ్ రీసెర్చ్ 2012 లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం పీరియడ్ నొప్పి చాలా సాధారణమైంద‌ని త‌ద్వారా దాదాపు 20% మంది మహిళల రోజువారీ పనితీరుకు అంతరాయం కలిగిస్తున్న‌ట్లు గుర్తించారు. పీరియడ్ నొప్పి అనేది చాలా మంది మహిళలు ఎదుర్కొనే స‌మ‌స్య అని, ఈ విష‌యంలో మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న వివ‌క్ష అంత‌మ‌య్యేలా జోమాటో తీసుకున్న‌నిర్ణ‌యంపై మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారు.