వెటరన్ యాక్టర్ రాజేష్ మృతి

వెటరన్ యాక్టర్ రాజేష్ మృతి

కన్నడ నటుడు ‘కళాతపస్వి’ రాజేష్ (89) కన్నుమూశారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ రోజు (శనివారం, ఫిబ్రవరి 19) ఉదయం తుదిశ్వాస విడిచారు. శ్వాసకోశ సమస్యలు, వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రాజేష్.. ఫిబ్రవరి 9న బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయన వెంటిలేటర్‌ మీద చికిత్స పొందుతున్నారు.

రాజేష్ ఏప్రిల్ 15, 1932న బెంగుళూరులో జన్మించారు. ఆయనకు నటనపై ఆసక్తి ఎక్కువ. దాంతో ఇంట్లోవాళ్లకు తెలియకుండా నాటకాల్లో నటించేవారు. రాజేష్ అసలు పేరు ముని చౌడప్ప. నాటకాల్లోకి వచ్చిన తర్వాత విద్యాసాగర్‎గా మార్చుకున్నారు. 1960లలో ఆయన సినీరంగంలోకి ప్రవేశించి.. 150కి సినిమాలలో నటించారు. ఆయన మొదటి సినిమా వీర సంకల్ప 1964లో విడుదలైంది.

రాజేష్ కు ఐదుగురు పిల్లలు ఉన్నారు. వారిలో ఒకరైన ఆశారాణి సినిమా నిర్మాత. ఆమెను యాక్షన్ కింగ్ అర్జున్ 1988లో వివాహం చేసుకున్నారు. రాజేష్ మృతిపట్ల కన్నడ సినీరంగం సంతాపం వ్యక్తం చేసింది. రాజేష్ అంత్యక్రియలు బెంగళూరులోని విద్యారణ్యపుర నివాసంలో సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.

For More News..

మేడారం జాతర ఫొటో గ్యాలరీ

ఛత్రపతికి ప్రధాని మోడీ నివాళులు