పరమ శివుడి పవిత్రమైన పర్వదినం మహా శివరాత్రి. మహా శివరాత్రి రోజు ఉపవాసంతో జాగారం చేస్తే ఎంతో పుణ్యంగా భావిస్తారు హిందూవులు. ఈ ఏడాది అంటే 2026వ సంవత్సరంలో ఈ పండుగ ఏ రోజు వచ్చింది.. 15వ తేదీనా.. 16వ తేదీనా.. ఆదివారమా.. సోమవారమా అనే సందేహం చాలా మందిలో వ్యక్తం అవుతుంది. అందరూ 15వ తేదీనే మహారాత్రి అంటున్నా.. కొందరు మాత్రం 16వ తేదీ కదా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. సందేహం ఉన్న వాళ్లకు.. వివరంగా.. శాస్త్ర బద్దంగా ఇస్తు్న్న సమాచారం ఇది.
హిందూ మతంలో అత్యంత పవిత్ర పండుగల్లో ఒకటి అయిన మహాశివరాత్రి 2026లో ఫిబ్రవరి 15వ తేదీ నాడు జరుపుకోవాలని పండితులు నిర్ణయించారు.
- చతుర్దశి తిథి ప్రారంభం: ఫిబ్రవరి 15, 2026, సాయంత్రం 5:04 గంటలకు
- చతుర్దశి తిథి ముగింపు: ఫిబ్రవరి 16, 2026, సాయంత్రం 5:34 గంటలకు
- నిషిత కాల ముహూర్తం : ఫిబ్రవరి 15 12:09 AM నుండి 1:01 AM
అర్థరాత్రిహిందూ పండుగలను సాధారణంగా ఉదయ తిథి ..సూర్యోదయం.. ఆధారంగా జరుపుకున్నప్పటికీ, నిషిత కాలంలో చతుర్దశి వచ్చే రోజున మహాశివరాత్రిని జరుపుకుంటారు. ఈ నియమం ఆధారంగా, మహాశివరాత్రిని ఫిబ్రవరి 15న జరుపుకుంటారు.
మహాశివరాత్రి రోజు అభిషేకం చేసేందుకు శుభ ముహూర్త సమయాలు
మహాశివరాత్రి రోజు రాత్రి శివుని పూజకు అత్యంత పవిత్రమైన సమయం నిషిత కాలం ఫిబ్రవరి 15 (12:09 AM నుండి 1:01 AM) అని పండితులు సూచిస్తున్నారు.
- మొదటి ప్రహార్: ఫిబ్రవరి 15న 6:11 PM నుంచి 9:23 PM వరకు
- రెండవ ప్రహార్: ఫిబ్రవరి 15 న 9:23 PMనుంచి ఫిబ్రవరి 16 తెల్లవారుజామున 12:35 AM
- మూడవ ప్రహార్: ఫిబ్రవరి 16 ఉదయం 12:35 AM నుంచి ఫిబ్రవరి 16 ఉదయం 3:47 AM
- నాల్గవ ప్రహార్: ఫిబ్రవరి 16 ఉదయం 3:47 నుంచి ఉదయం 6:59 AM వరకు
