హనుమాన్ జయంతి (ఏప్రిల్ 2) చైత్ర పూర్ణిమ గురువారం రోజున శని, కుజ గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది .హనుమంతుడు శని దోషాలను నివారిస్తాడు .. కుజుడికి (భూమి పుత్రుడు) ఇష్టమైన దైవం. ఈ పూజ శని-కుజ దోషాలను తొలగిస్తుంది.. జ్యోతిష్యం ప్రకారం, హనుమంతుడి ఆశీస్సులు కావాలనుకునే వారు హనుమాన్ జయంతి రోజున కొన్ని మంత్రాలను పఠించడం వల్ల జీవితంలోని సమస్యల నుంచి ఉపశమనం పొందడంతో పాటు, సకల పాపాల నుంచి విముక్తి పొందుతారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఏప్రిల్ 2 హనుమజ్జయంతి సందర్భంగా 12 రాశుల వారు ఏయే మంత్రాలను చదవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
మేష రాశి: ఈ రాశి వారికి కుజుడు అధిపతి.. హనుమాన్ జయంతి రోజున ఈ రాశి వారు ఓం రాం హనుమతే నమః’ అనే మంత్రాలను పఠించాలి. ఆంజనేయ స్వామికి తులసి మాల సమర్పించి .. సింధూరాన్ని సమర్పించాలి. షోడశోపచార పూజ చేసిన తరువాత స్వామికి మోతీచూర్ లడ్డూలను ( చిన్న లడ్డూలు) నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల అంజనా పుత్రుడైన హనుమంతుడు.... సుఖ సంతోషాలను ప్రసాదించి.. కష్టాలను తొలగేలా... స్వామివారు అనుగ్రహిస్తారని పండితులు చెబుతున్నారు
వృషభ రాశి: ఈ రాశికి అధిపతి శుక్రుడు .. హనుమజ్జయంతి రోజున ఈ రాశి వారు ఓం ఆంజనేయాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదవాలి. తరువాత స్వామిని అష్టోత్తరంతో పూజించి.. హనుమంతుడికి తీపిపదార్దాన్ని ( అప్పాలు) నైవేద్యంగా పెట్టి పూజించాలి. అప్పాల దండను (108) స్వామికి సమర్పిస్తే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల హనుమంతుని ఆశీర్వాదం లభించి మీకు అన్ని పనుల్లో విజయం చేకూరుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
మిథున రాశి: ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ రాశి వారు ఏప్రిల్ 2 హనుమజ్జయంతి రోజున ఓం ధర్మనుజాయ నమః అనేమంత్రాన్ని పఠించడం వలన చాలా రంగాల్లో అద్భుత విజయాలు సాధించే అవకాశాలను పొందుతారు. అలాగే పాలతో చేసిన తీపి పదార్థాలను స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల జీవితం శాంతి, సంతోషాలను స్వామివారు కలుగజేస్తారు.
కర్కాటక రాశి: ఈరాశికి అధిపతి చంద్రుడు. ఈ రాశి వారు ఏప్రిల్ 2 వ తేది గురువారం రోజున ఓం బజరంగాయ నమః అనే మంత్రాన్ని పఠించాలి. తమలపాకులతో ఆకుపూజ చేయాలి. 108 తమల పాకులతో దండ తయారు స్వామి వారికి సమర్పించాలి. హనుమాన్ చాలీసా 11 సార్లు చదివి స్వామికి ధూప దీపం తరువాత .. అప్పాలను నైవూద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వలన ఉద్యోగ సమస్యలు... ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
సింహ రాశి: సూర్యుడు ఈరాశికి అధిపతి.. ఈ రాశివారు ఓం మహాబలాయ నమః అనే మంత్రాన్ని 27 నిమిషాల పాటు శ్రద్దగా చదవాలి. చదివేటప్పుడు మనస్సు భగవంతునిపైనే ఉండాలి. ఈ రాశివారు హనుజ్జయంతి రోజున ఆంజనేయస్వామికి తులసి మాల .. సింధూరాన్ని సమర్పించాలి. ఆ తరువాత 108 ప్రదక్షిణాలు ఇలా చేయడం వలన జీవితంలో ఇప్పటి వరకు ఉన్న అన్ని రకాల సమస్యలు తొలగిపోయి.. అన్ని పనుల్లో విజయం సాధిస్తారని పండితులు చెబుతున్నారు.
కన్య రాశి: ఈరాశికి అధిపతి బుధుడు.. హనుమజ్జయంతి ( ఏప్రిల్ 2న ఉండే గ్రహ బలం ఆధారంగా ఈ రాశి వారు ఓం హర్యే నమః అనే మంత్రాన్ని పఠించాలి. ఆ తరవాత ఆంజనేయస్వామికి అభిషేకం.. ఆకుపూజ నిర్వహించాలి. 108 వడలు సమర్పించాలి. ఇలా చేయడం వలన ఆర్థికంగా అభివృద్ది చెందడంతోపాటు.. ఆస్తి సమస్యలు పరిష్కారమవుతాయని పండితులు చెబుతున్నారు.
తుల రాశి: ఈరాశికి అధిపతి కూడా అధిపతి శుక్రుడే.. ఈ రాశి వారు హనుమజ్జయంతి రోజు ఓం మారుతాత్మజాయ నమః అనే మంత్రాన్ని పఠించాలి. ఇలా చేయడం వలన హనుమంతుడి కటాక్షం పుష్కలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో పురోభివృద్ధి సాధిస్తారు. చేపట్టిన అన్ని పనులు హనుమంతుడి దయతో సఫలమవుతాయి. ఈ రాశి వారి ఆర్థిక దృక్పథం చాలా బలంగా ఉండి జీవితంలో ఎప్పుడు డబ్బుకు లోటు లేకుండా ఉంటారు.
వృశ్చిక రాశి: ఈరాశికి అధిపతి కుజుడు. హనుమజ్జయంతి రోజున ఈ రాశి వారు ఓం సంకటమోచనాయ నమః అనే మంత్రాన్ని పఠించడం వలన ఏ పని చేపట్టిన ఆ పని సక్సెస్ అవుతుంది. హనుమంతుడిని తమలపాకులతో పూజించడం వల్ల ఈ రాశి జాతకులకు శుభప్రదంగా ఉండటమే కాకుండా ..ధనం కొదువ లేకుండా హనుమంతుడు చూస్తాడని పండితులు చెబుతున్నారు.
ధనుస్సు రాశి: బృహస్పతి ఈరాశికి అధిపతి. రామభక్త హనుమాన్ జయంతి రోజున ఈ రాశి వారు ఓం శ్రీరామదూతాయ నమఃఅనే మంత్రాన్ని పఠించాలి. స్వామికి లవంగాలతో తయారు చేసిన ప్రసాదాన్ని సమర్పించాలి. వీరు ఆంజనేయ స్వామి దేవాలయంలో 108 ప్రదక్షిణాలు చేయాలి. ఇలా చేయడం వల్ల హనుమంతుని అనుగ్రహం పొందుతారని పండితులు అంటున్నారు.ఆంజనేయస్వామి ఆశీస్సులతో ఈరాశుల వారు ఇప్పటి వరకు పడుతున్న ఇబ్బందులు తొలగి.. సమస్యలు పరిష్కారం అవుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
మకర రాశి: ఈరాశికి అధిపతి శని.. హనుమత్ జయంతి రోజున ఈ రాశి వారు ఓం వీర హనుమతే నమః అనే మంత్రాన్ని పఠించాలి. స్వామికి తీపి పదార్దాలు నైవేద్యం సమర్పించాలి. ఇంకా సుందరాకాండ పారాయణం చేయడం లేదా శ్రద్దగావినాలి. ఇలా చేయడం వలన జీవితంలో అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి.
కుంభ రాశి: శని ఈరాశికి అధిపతి ఓం చిరంజీవినే నమః అనే మంత్రాన్ని పఠించాలి. మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. సమస్యలు వచ్చినప్పటికీ వాటిని పరిష్కరించుకునే శక్తి హనుమంతుడు మీకు ఇస్తారు. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. మంగళవారం రోజు ఆంజనేయ దండకం చదవడం వల్ల శ్రేయస్సు, సంతోషం కలుగుతాయి.
మీన రాశి: బృహస్పతి ఈరాశికి అధిపతి. హనుమాన్ జయంతి రోజున ఓం ద్రోణాచలధరాయ నమః అనే మంత్రాన్ని పఠించాలి. సింధూరంతో పూజించి హనుమాన్ చాలీసాను 11 సార్లు చదవాలి. ..దీనితో పాటు హనుమాన్ అష్టోత్రాన్ని పఠించాలి. జిలేబీ వంటి తీపి పదార్థాలను స్వామివారికి సమర్పించాలని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మీరు ఇబ్బంది పడుతున్న ప్రతికూల శక్తులు తొలగి... మీరు ప్రతి పనిలోనూ ఆంజనేయస్వామి అనుగ్రహం వల్ల విజయం .. పురోగతిని పొందుతారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
