Vastu tips : ఇంటి మెట్లకు కిటికీలు ఉంటే ఇబ్బందులు వస్తాయా.. పెట్స్ రూం ఏ దిక్కులో ఉండాలి..!

Vastu tips :  ఇంటి మెట్లకు కిటికీలు ఉంటే ఇబ్బందులు వస్తాయా.. పెట్స్ రూం ఏ దిక్కులో ఉండాలి..!

ఇంట్లో ప్రతిది వాస్తు ప్రకారమే ఉండాలి.. అంతేకాదు ఇంటి నిర్మాణం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి..  ఫస్ట్​ ఫ్లోర్​ కు వెళ్లే మెట్లకు కిటికిలు పెట్టుకొంటే వాస్తు ప్రకారం ఇబ్బందులు వస్తాయా.. అలాగే పెట్స్​ కోసం ప్రత్యేక గదిని ఎక్కడ నిర్మించుకోవాలి.. ...మొదలగు విషయాల గురించి వాస్తు కన్సల్టెంట్​  కాశీనాథుని శ్రీనివాస్​ గారు ఏమంటున్నారో చూద్దాం...

ప్రశ్న: ఇంటిపైకి ఎక్కేందుకు తూర్పు నుంచి పడమరకు మెట్లు ఉన్నాయి. అయితే, మెట్లు ఉన్న గోడకు పడమర సెంటర్, వాయువ్యం దిక్కుల్లో కిటికీలు పెట్టుకోవచ్చా?

జవాబు: ఫస్ట్ ఫ్లోర్​ కు  వెళ్లే మెట్లపైన వెంటిలేషన్ కోసం మెట్లకు పైన కిటికీలు పెట్టుకుంటున్నారు ఈమధ్య దీనివల్ల వెంటిలేషన్ బాగుంటుంది. గాలి, వెలుతురు కూడా వస్తాయి. అయితే కిటికీలు సరిసంఖ్యలో ఉండేలా చూసుకోవాలి


ప్రశ్న:  ప్రహరీ లోపల ఇంటి గోడకు మధ్య పెంపుడు జంతువుల కోసం చిన్న గది కట్టుకోవాలనుకుంటున్నాం. ఏవైపు కట్టుకుంటే బాగుంటుంది?

జవాబు: ఇంట్లో పెంపుడు జంతువుల కోసం ఉత్తర వాయువ్యం లేదా ఆగ్నేయంలో గదులు కట్టొచ్చు. అయితే, ఇంటి ప్రధాన గోడ, ప్రహరీకి తగలకుండా వీటిని మధ్యలో కట్టుకుంటే మంచిది.