మార్చి రెండో వారంలో ఆర్ కె దీక్ష రిలీజ్‌‌

 మార్చి రెండో వారంలో  ఆర్ కె దీక్ష రిలీజ్‌‌

ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శక నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ఆర్కే దీక్ష’.  కిరణ్ హీరోగా అక్సా ఖాన్, అలేఖ్య రెడ్డి హీరోయిన్స్‌‌గా నటించారు.  తులసి, అనూష, కీర్తన,  ప్రవల్లిక, రోహిత్ శర్మ  కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ రిలీజ్‌‌ డేట్‌‌ వివరాలను తెలియజేసేందుకు ప్రెస్‌‌మీట్ నిర్వహించారు.  ఈ సందర్భంగా ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ‘మార్చి రెండో వారంలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నాం.  పట్టుదలగా  ప్రయత్నిస్తే విజయం సాధ్యమనే మంచి సందేశంతో.. లవ్, యాక్షన్, ఎమోషన్ లాంటి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌‌తో తెరకెక్కించాం.  

అక్సాఖాన్ చేసిన సాంగ్ స్పెషల్ అట్రాక్షన్. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది’ అని చెప్పారు.  ‘నంది అవార్డుల నేపథ్యంలో నంది నంది అనే స్పెషల్ సాంగ్ చేశాం. ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది’ అని అక్సా ఖాన్‌‌ చెప్పింది.  ఇంకా ఈ కార్యక్రమంలో హీరో కిరణ్,  నటి తులసి,  సమర్పకులు డీఎస్ రెడ్డి పాల్గొన్నారు.