అమీర్ ఖాన్ విడాకులపై స్పందించిన కూతురు ఐరా ఖాన్

అమీర్ ఖాన్ విడాకులపై స్పందించిన కూతురు ఐరా ఖాన్

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్.. కూతురు ఐరా ఖాన్ సోషల్ మీడియా వేదికగా తండ్రి విడాకుల ప్రకటనపై స్పందించింది. అమీర్ ఖాన్- కిరణ్ రావు  తాము స్నేహపూర్వకంగానే విడాకులు తీసుకుంటున్నట్లు రెండు రోజుల క్రితం చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. ఎలాంటి ముందస్తు సంకేతాలు లేకుండా హఠాత్తుగా చేసిన ప్రకటన కలకలం రేపింది. బాలీవుడ్ వర్గాల్లో మాత్రం ముందే తెలుసన్నట్లు కామెంట్లు వినిపిస్తున్నా.. నెటిజనులు మాత్రం వీరి విడాకుల వ్యవహారంపై ట్రోల్ చేస్తున్నారు. ఫ్యాన్స్ సరే సరి.. సన్నిహితులైతే కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రెండు రోజులుగా అమీర్ ఖాన్ విడాకుల వ్యవహారమే హాటా టాపిక్ గా నిలుస్తోంది. 
ఈ నేపధ్యంలో అమీర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్త కుతురు ఐరా ఖాన్ ఇన్ స్టా వేదికగా స్పందించడం వైరల్ గా మారింది. అమీర్ ఖాన్-కిరణ్ రావు ఇద్దరూ తమ 15 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలకడానికి ప్రధాన కారణం అమీర్ ఖాన్ కు యంగ్ హీరోయిన్ ఫాతిమాతో ఎఫైర్ అన్న ఆరోపణలు ఉన్నాయి. వీరిద్దరి వ్యవహారంపై బాలీవుడ్ లో  కొంత కాలంగా గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఎఫైరే కారణమంటూ నెటిజనులు ట్రోలింగ్ స్తూ... మీమ్స్ తో ఆటాడుకుంటున్నారు. వారిద్దరు విడాకులు తీసుకుంటే మీకేం సంబంధం అంటూ రాంగోపాల్ వర్మ స్పందిచడం తెలుగునాట మాత్రమే కాదు.. బాలీవుడ్ లోనూ వైరల్ అవుతోంది.  ఈ క్రమంలో నెటిజనుల కామెంట్స్ ను బలపరిచే రీతిలో అమీర్  ఖాన్ మొదటి భార్య కూతురు ఐరాఖాన్ స్పందించడం వైరల్ అవుతోంది. రేపు తదుపరి సమీక్ష.. ఏమి జరగబోతోందో.. అంటూ ఐరా ఖాన్ ఇన్ స్టా గ్రామ్ వేదికగా చేసిన కామెంట్ ట్రెండింగ్ అవుతోంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ira Khan (@khan.ira)