ఖమ్మంలో డంపింగ్ ప్లేస్లో బయో మైనింగ్  సక్సెస్!   8 ఎకరాల్లో పెరుగుతున్న వనం

ఖమ్మంలో డంపింగ్ ప్లేస్లో బయో మైనింగ్  సక్సెస్!   8 ఎకరాల్లో పెరుగుతున్న వనం

ఖమ్మం, వెలుగు: ఖమ్మం నగరంలో బయో మైనింగ్ సక్సెస్ అయింది. ఇతర ప్రధాన నగరాల్లో ఫెయిల్ అయినప్పటికీ ఇక్కడ మంచి ఫలితాలు ఇచ్చింది. కొండలా పేరుకు పోయిన చెత్త స్థానంలో ఇప్పుడు పచ్చదనం పరుచుకొని చిన్న పాటి అడవిని తలపిస్తోంది.

బయో మైనింగ్ ద్వారా ఖాళీ అయిన మొత్తం 10 ఎకరాల స్థలంలో 8 ఎకరాల విస్తీర్ణంలో మున్సిపల్ అధికారులు రెండేళ్ల క్రితం మొక్కలు నాటారు. ప్రస్తుతం అవి  ఏపుగా పెరిగాయి. అర్బన్ మండలం దానవాయిగూడెంలో 38 ఎకరాల్లో డంపింగ్ యార్డ్ ఉంది. దాదాపు నాలుగేళ్ల నుంచి ఏపీకి చెందిన ఒక ప్రైవేటు కంపెనీ ద్వారా బయో మైనింగ్ జరుగుతుంది. ఇప్పటి వరకు దాదాపు లక్షన్నర టన్నుల లెగసీ వేస్ట్ ను క్లియర్ చేసినట్టు అధికారులు చెబుతున్నారు.