ధరణి పిచ్చి వెబ్ పోర్టల్.. దాన్ని మార్చకపోతే సీఎంని మార్చేస్తాం

ధరణి పిచ్చి వెబ్ పోర్టల్.. దాన్ని మార్చకపోతే సీఎంని మార్చేస్తాం
  • రైతుల భూములు కబ్జా చేయడం కోసమే పట్టాలివ్వడం లేదు]
  • కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్డంకి దయాకర్

మహబూబాబాద్ జిల్లా: ధరణి పిచ్చి వెబ్ పోర్టల్, ఈ పిచ్చి ధరణి వెబ్ పోర్టల్ ని మార్చకపోతే ముఖ్యమంత్రిని మార్చడం తధ్యమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్డంకి దయాకర్ అన్నారు. అధికార పార్టీ నేతలు రైతుల భూములు కబ్జా చేయడం కోసమే రైతులకు పట్టాలివ్వడం లేదని ఆయన ఆరోపించారు. టిఆర్ఎస్ నాయకుడు యాకుబ్ రెడ్డి, ఎమ్మెల్యే శంకర్ నాయక్ స్వార్ధం వల్ల గిరిజన రైతులకు పట్టాలు మంజూరు కావడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 
గురువారం కేసముధ్రం మండలం నారాయణపురం గ్రామాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్డంకి దయాకర్, ఆదివాసీ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు తేజవాత్ బెల్లయ్య నాయక్  సందర్శించారు. పట్టాదారు పాసుపుస్తకాల మంజూరిపై రైతులను కలిసి మాట్లాడారు. రైతుల కష్టాలు,సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  
ఈ సందర్భంగా అద్దంకి దయాకర్ మాట్లాడుతూ ధరణి వలన నారాయణపురం రైతులు నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. తాండలను గ్రామ పంచాయతీలు చేసిన ముఖ్యమంత్రి నారాయణ పురం గ్రామాన్ని అడవిని చేశారని, ప్రభుత్వం తల తోక నిర్ణయం వలన ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. గిరిజన ప్రజా ప్రతినిధులు గిరిజన భూములను కొల్లగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో మంజూరు చేసిన సుమారు 12 లక్షల ఎకరాలకు పట్టాలు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 
పట్టాభూమి ఫారెస్టు భూమి ఎలా అయ్యిందో సమాధానం చెప్పాలి
పట్టా భూమి ఫారెస్టు ఏరియా గా ఎలా మార్పు చెందిందో అధికార పార్టీ నాయకులు ప్రజా  ప్రతినిధులు సమాధానం చెప్పాలని ఆదివాసీ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు తేజవాత్ బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ నారాయణపురం గ్రామంలో మిగిలిన 180 ఎకరాల భూమిని స్థానిక నాయకుడు యాకుబ్ రెడ్డి కబ్జా చేయడానికి పట్టాల మంజూరులో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక మంత్రి ,ఎంపీ ,ఎమ్మెల్యే లు స్పందించి రైతులకు పట్టాలు  మంజూరు చేయాలిని డిమాండ్ చేశారు. ధరణి వెబ్ పోర్టల్ అంతా అంతా తప్పుల తడక, రైతులకు పట్టాలు మంజూరు చేయకపోతే మంత్రి, ఎమ్మెల్యే ల ఇండ్లను ముట్టడిస్తామని తేజావత్ బెల్లయ్య నాయక్ హెచ్చరించారు.