
యంగ్ టాలెంటెడ్ సుహాస్ (Suhas) హీరోగా అర్జున్ వై కె దర్శకత్వంలో జెఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘ప్రసన్న వదనం’(Prasanna Vadanam).పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా ఇవాళ (మే3న)థియేటర్లో రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
ఈ సినిమాలో సుహాస్ నటనకు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు.చాలా ఇంటెన్సివ్ యాక్టింగ్ తో..తనదైన సహజమైన డైలాగ్ డెలివరీతో అలరిస్తోంది.దీంతో సుహాస్ హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయం అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.ఈ సినిమా ఫేస్ బ్లైండ్‍నెస్ అనే విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కి సక్సెస్ అవ్వడంతో ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు.
ఈ సందర్భంగా సుకుమార్, బుచ్చిబాబు డైరెక్టర్స్ కలిసి..ప్రసన్న వదనం డైరెక్టర్ అయిన అర్జున్ వై కె, సుహాస్‌ని ఇంటర్వ్యూ చేశారు. అయితే సుకుమార్ తెరకెక్కించిన సినిమాల్లో పనిచేసిన అర్జున్ టాలెంట్ ఎలాంటిదో చెబుతూ ప్రశంసలు కురిపించాడు. ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ మూవీ షూటింగ్ టైంలో తనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు సుక్కు సార్.
‘‘నాన్నకు ప్రేమతో’ సినిమాతో అర్జున్ పై ఎన్టీఆర్ (NTR)కు నమ్మకం కలిగింది. ఎందుకంటే, ఓ మేజర్ ఎపిసోడ్‌కు అర్జునే దర్శకత్వం వహించాడు. ఓ దర్శకుడిగా నా అసిస్టెంట్‌ను షూట్ చేయమనే విషయాన్నీ నేను చెప్పొచ్చు. కానీ, అంత పెద్ద హీరో కూడా ఆ విషయానికి అంగీకరించడం చాలా పెద్ద విశేషం. ఎన్టీఆర్ ‘ఎస్’ చెప్పాడంటేనే అర్జున్ టాలెంట్ ఏంటో నాకు అప్పుడే తెలిసిపోయింది.
ఇక అర్జున్ డైరెక్ట్ చేసిందే సినిమాలో ఎటువంటి మార్పులు చేయకుండా పెట్టాం. అసలు నేను రీషూట్ చేయలనే ఆలోచన కూడా రాలేదని అన్నారు.అలాగే , అల్లు అర్జున్ ఆర్య 2’లో కూడా ఓ సీన్‌కీ అర్జున్ దర్శకత్వం వహించారని తెలిపారు.
అర్జున్ వై కె..రామ్ ‘జగడం’ నుంచి సుకుమార్ తెరకెక్కించిన సినిమాలన్నింటికీ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు.అర్జున్, మరో అసిస్టెంట్ తోట శ్రీనుతో కలిసి 23 రోజుల్లో నాగ చైతన్య ‘100% లవ్’ స్టోరీ రాశానని సుక్కు సార్ శిష్యుడి ప్రత్యేకతను వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.