దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. పవన్ సాదినేని దర్శకుడు. దుల్కర్‌కు జంటగా సాత్విక వీరవల్లి నటిస్తోంది. శ్రుతిహాసన్ కీలకపాత్రను పోషిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఆదివారం అప్డేట్ ఇచ్చారు. సోమవారం నుంచి కొత్త షెడ్యూల్ రాజమండ్రిలో ప్రారంభమవుతోంది. క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
హీరోహీరోయిన్స్ దుల్కర్ సల్మాన్, సాత్విక ఈ షూట్లో పాల్గొంటారని దర్శకనిర్మాతలు తెలియజేశారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పణలో సందీప్ గున్నం, రమ్య గున్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రాఫర్. చివరిదశ చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రం వేసవిలో పాన్ ఇండియా వైడ్‌గా విడుదల కానుంది.
