ఫ్లిప్‌కార్ట్ లో మరోసారి భారీ ఆఫర్లు

ఫ్లిప్‌కార్ట్ లో మరోసారి భారీ ఆఫర్లు

ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే ఆఫర్ల కోసం ఎదురు చూస్తున్న భారతీయ వినియోగదారులకు 10 రోజుల ముందుగానే ఆఫర్ల పండుగ వచ్చేసింది. ఆన్ లైన్ లో  ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్...గత నెల 27 - 29 తేదీల్లో ప్రకటించిన బిగ్ డిస్కౌంట్ సేల్ ఆఫర్లను మరోసారి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సమాచారం.   ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్‌’ పేరుతో  ఈనెల 5-9 తేదీల్లో భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులోకి తెస్తున్నట్లు బిజినెస్ వర్గాల సమాచారం.  ఎలక్ర్ర్టిక్.. ఎలక్ర్టానిక్ గాడ్జెట్లు, మొబైల్ ఫోన్లు.. ఆపిల్‌ ‘ఐ’ ఫోన్లు, శాంసంగ్‌, ఒప్పో, వివో స్మార్ట్‌ఫోన్లతోపాటు డెస్క్ టాప్ లు,  ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్‌లు, ఎల్ ఈడీలు,లేటెస్ట్ ఫీచర్ల టీవీలు, కిచెన్ తదితర ఉత్పత్తులకు భారీ ఆఫర్‌లను అందించనుంది. గత నెలలో ఆఫర్లు ఉపయోగించుకోలేక నిరాశకు గురైన వారికి ఈ ఆఫర్ ఉపయోగపడేలా ఫ్లిప్ కార్ట్ సన్నాహాలు చేస్తోంది.  యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ తదితర బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగదారులకు 10 శాతం తక్షణ తగ్గింపు ఇవ్వనున్నట్లు సమాచారం.  ఫ్లిప్ కార్ట్ లో సభ్యత్వం ఉన్న వారు ఈ సేల్‌లో ఒక రోజు ముందుగానే సేల్‌లో పాల్గొనే అవకాశం ఉంటుంది.