జైపూర్ ఎక్స్​ప్రెస్ కాల్పుల్లో నాంపల్లికి చెందిన  సయ్యద్ సయోద్దీన్​ మృతి

జైపూర్ ఎక్స్​ప్రెస్ కాల్పుల్లో నాంపల్లికి చెందిన  సయ్యద్ సయోద్దీన్​ మృతి

మెహిదీపట్నం, వెలుగు : జైపూర్ ఎక్స్​ప్రెస్ రైల్లో జరిగిన కాల్పుల ఘటనలో హైదరాబాద్​కు చెందిన సయ్యద్ సయోద్దీన్ (40) చనిపోయాడు. కర్నాటక స్టేట్​కు చెందిన సయ్యద్ సయోద్దీన్.. కొన్నేండ్ల కింద హైదరాబాద్ నాంపల్లి బజార్ ఘాట్​కు వలస వచ్చాడు. అతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. గుజరాతీ గల్లీలోని జబ్బార్ మొబైల్ షాప్​లో సయ్యద్ పని చేస్తుండేవాడు. షాప్ ఓనర్ జబ్బార్​తో కలిసి రాజస్థాన్​లోని అజ్మీర్ దర్గాకు వెళ్లాడు.

హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో జైపూర్ – ముంబై ఎక్స్​ప్రెస్ ఎక్కాడు. సోమవారం తెల్లవారుజామున ట్రైన్ మహారాష్ట్రలోని పాల్ఘర్ స్టేషన్ దాటాక ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్ విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఏఎస్సైతో పాటు ముగ్గురు ప్రయాణికులు చనిపోయారు. వారిలో హైదరాబాద్​కు చెందిన సయ్యద్ కూడా ఉన్నాడు.