ఒకేసారి లక్ష కెమెరాలతో చూస్తున్నాం: హోంమంత్రి 

ఒకేసారి లక్ష కెమెరాలతో చూస్తున్నాం: హోంమంత్రి 
  • తెలంగాణ వచ్చాక లా అండ్ ఆర్డర్ కంట్రోల్‌లో ఉంది: హోంమంత్రి మహమద్ అలీ

హైదరాబాద్: తెలంగాణ వచ్చాక లా అండ్ ఆర్డర్ కంట్రోల్‌లో ఉంది.. ఒకేసారి లక్ష కెమెరాలతో చూస్తుండడం మన రాష్ట్రంలో ఉందని హోం మంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. ప్యాట్నిలోని ఎస్ వి ఐ టి కాలేజీలో హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో కొత్త సీసీ కెమెరాల ప్రారంభోత్సవం జరిగింది. కమ్యూనిటీ సీసీ కెమెరాల ప్రాజెక్టులో భాగంగా 358 సీసీ కెమెరాలను హోం మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఈస్ట్ జోన్ పరిధిలో 120,నార్త్ జోన్ 125,సౌత్ జోన్ 77,వెస్ట్ జోన్ పరిధిలో 36 సీసీ కెమెరాలు కలిపి మొత్తం 358 కెమెరాలను  ప్రారంభించారు హోంమంత్రి మహమూద్ అలీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన తరువాత లాండ్ అండ్ ఆర్డర్ కంట్రోల్‌లో ఉందన్నారు. సీఎం కేసీఆర్ ప్రజా భద్రత కోసం అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, లాండ్ అండ్ ఆర్డర్ కంట్రోల్ లో ఉంది కాబట్టే రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్నారు. 
 సీఎం కేసీఆర్ పోలీస్ శాఖకు 700 కోట్లు కేటాయించారని, మహిళా భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చి  షీ టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు. సీసీ కెమెరాలు క్రైమ్ ను కంట్రోల్ చేస్తుందని, ప్రజాభద్రత కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఒకే సారి లక్ష కెమెరాలు చూడవచ్చు, ప్రజా భద్రత కోసం పోలీసులు నిరంతరం పని చేస్తున్నారని మంత్రి మహమూద్ అలీ వివరించారు. కరోనా టైంలో పోలీసులు చాలా బాగా పని చేశారని ఆయన ప్రశంసించారు. రక్షణ కోసం సీసీ కెమెరాలు ప్రతి ఒక్కరూ ఏర్పాటు చేసుకోవాలని ఆయన కోరారు. 

క్రైమ్ రేట్ తగ్గడానికి సీసీ కెమెరాలే కారణం : మంత్రి తలసాని

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణలో క్రైమ్ రేట్ తగ్గడానికి సీసీ కెమెరాలే కారణమని అన్నారు.  దేశంలో లాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటే దేశం అభివృద్ధి చెందుతుందని, సీఎం కేసీఆర్ ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టే దేశంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందని ఆయన పేర్కొన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు కు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, నియోజకవర్గ అభివృద్ధి నిధులలో సీసీ కెమెరాలకు అధిక నిధులు కేటాయిస్తున్నామన్నారు. నా నియోజకవర్గనికి 2 కోట్లు కేవలం సీసీ కెమెరాల ఏర్పాటుకు  కేటాయిస్తున్నానని మంత్రి తలసాని వెల్లడించారు. ప్రతిఒక్కరూ  భద్రత కోసం సీసీ కెమెరాలు పెట్టుకోవాలని, సీసీ కెమెరాల ఏర్పాటుకు నిధులు కేటాయిస్తామన్నారు. హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ దేశంలొనే హైదరాబాద్ సేఫ్ సిటీగా ఉందన్నారు. తెలంగాణ లో 7 లక్షల సీసీ కెమెరాలు ఉంటే...హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 3 లక్షల 75వేల సిసి కెమెరాలు ఉన్నాయన్నారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో సీసీ కెమెరాలు కీలకంగా పని చేస్తాయన్నారు. సేఫ్టీలో సిసి కెమెరాలు చాలా ముఖ్యమైనవన్నారు. 

హైదరాబాద్ లో 3 లక్షల 75 వేల కెమెరాలున్నాయి: డీజీపీ మహేందర్ రెడ్డి

హైదరాబాద్ సిటీ పరిధిలో 3 లక్షల 75 వేల సిసి కెమెరాలు ఉన్నాయి, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో సీసీ కెమెరాలు కీలకంగా పని చేస్తాయని డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. సమాజంలో భద్రత పెంచడానికి సిసి కెమెరాలు ఉపయోగ పడతాయని, ప్రజా ప్రతినిధులు సీసీ కెమెరాల కు నిధులు అందిస్తున్నారని, ప్రజా భద్రత పెంచడానికి గ్రామాల్లో సైతం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారని ఆయన వివరించారు.  ఎంతో ఉపయోగం.. భద్రత, రక్షణ ఉంటుంది కాబట్టే పేద ప్రజలు సైతం సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సీసీ కెమెరాల ఫుటేజ్ తోనే చాలా కేసులు పరిష్కారం చేస్తున్నామని, స్తున్నాం...ఒక సీసీ కెమెరా 100 మంది పోలిస్ తో సమానమన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు తో క్రైమ్ రేట్ తగ్గుతోందని, శిక్షలు పడటంలో సీసీ కెమెరాలు ఉపయోగపడతాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నాం, ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.