కరీంనగర్ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీదే విజయం : వెలిచాల రాజేందర్ రావు

  కరీంనగర్ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీదే విజయం :  వెలిచాల రాజేందర్ రావు

కరీంనగర్  పార్లమెంట్ పోలింగ్ 20-20 మ్యాచ్ లాగా సాగిందని అభిప్రాయపడ్డారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు.  బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఎన్ని డ్రామాలు చేసినా విజయం కాంగ్రెస్ పార్టీదేనని  ధీమా వ్యక్తం చేశారు.  తనకు టికెట్ కేటాయించే సమయానికి పోలింగ్ కు చాలా తక్కువ సమయం ఉన్నప్పటికీ.. 15 రోజులలో 15 లక్షల మందిని కలుసుకున్నాని తెలిపారు.  హుజురాబాద్,  సిరిసిల్లలో జరిగిన జనం జాతర సభలు విజయవంతం అయ్యాయని చెప్పుకొచ్చారు.  కరీంనగర్ లో చేపట్టిన జన జాతర సభకు ప్రకృతి అనుకూలించకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి రాలేకపోయారన్నారు.  70 వేల మందితో చరిత్రలో నిలిచిపోయే విధంగా కరీంనగర్ లో రోడ్ షో చేపట్టామన్నారు వెలిచాల.  కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో సక్సెస్ కాగలిగిందని వెల్లడించారు.  తనకు ఓటేసిన ఓటర్లకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.