
టాలీవుడ్ యువ నటుడు చైతన్య రావు (Chaitanya Rao), భూమి శెట్టి(Bhumi Shetty) జంటగా కుమార స్వామి(Kumara Swamy) (అక్షర) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘షరతులు వర్తిస్తాయి’(Sharathulu Varthisthai). స్టార్ లైట్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై నాగార్జున సామల, శ్రీష్ కుమార్ గుండా, డా.కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మించారు.
మార్చి 15న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా రిలీజైన రెండు నెలల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వడానికి సిద్ధమైంది.
షరతులు వర్తిస్తాయి ఓటీటీ:
30 వెడ్స్ 21 అనే యూట్యూబ్ సిరీస్‍తో పాపులర్ అయిన చైతన్య రావు లేటెస్ట్ ఫిల్మ్ షరతులు వర్తిస్తాయి. ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో మే 18న స్ట్రీమింగ్‍కు రానున్నట్లు ఆహా అధికారికంగా ప్రకటించింది. “మంచి మిడిల్ క్లాస్ మూవీ చూడాలని ఉందా.. అయితే షరతులు వర్తిస్తాయి సినిమా మే 18వ తేదీన ఆహాలో ప్రీమియర్ కానుంది” అని ఆహా నేడు (మే 14) ట్వీట్ చేసింది.
Manchi Middle class movie chudalani undha??♂️
— ahavideoin (@ahavideoIN) May 14, 2024
Aithe "షరతులు వర్తిస్తాయి!"?♀️#SharathuluVarthisthaiOnAha Premieres May 18th!@IamChaitanyarao @ShettyBhoomi @NagarjunSamala @sureshbobbili9 @aksharakumar726 pic.twitter.com/2snj01oYkU
షరతులు వర్తిస్తాయి కథ:
పల్లెటూరి కథ..వారి ప్రేమలు..కుటుంబంలో నెలకొన్న సమస్యలను కళ్ళకు కట్టినట్లు చూపించారు. కరీంనగర్ జిల్లాలో ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన చిరంజీవి..తమ్ముడు..ఫోన్ ఇప్పియరాదు అన్న, చెల్లి..కోచింగ్ ఫీజు కట్టాలి అన్న..ఇలా కుటుంబ బాధ్యతలను భుజానికి ఎత్తుకొని బ్రతుకుతుంటాడు చిరంజీవి.
అయితే అదే ప్రాంతానికి చెందిన విజయశాంతితో చిరంజీవి ప్రేమలో పడతాడు. ఇష్టాలు..కష్టాలు..బాధలు..బంధాలు నడుమ ఓ సంఘటన జరుగుతుంది. దీంతో కుటుంబం కోసం పోరాడే చిరంజీవికి వచ్చిన కష్టంతో ఎలా బయటపడ్డాడు అనేది ఈ సినిమా కథ.
మనుషులు ఉన్నంత కాలం కుటుంబాలు, కుటుంబాలు ఉన్నంతకాలం సమస్యలు ఉంటాయి. అందుకే చాలా కుటుంబాలు కొన్ని షరతుల మధ్యన జీవిస్తూ ఆనందంగా ఉంటున్నాయి. మరి మీ కుటుంబ కథకి దగ్గరగా ఏవైనా పోలికలు ఉన్నాయో..లేదో ఈ సినిమా చూసి తెలుసుకోండి.