హైదరాబాద్ లోని సంతోష్ నగర్ 111/68 పోలింగ్ స్టేషన్ లో దొంగ ఓటు వేయడానికి యత్నించిన యువతిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ముందుగా యువతి 356 సీరియల్ నెంబర్ ఓటర్ స్లిప్ లో ఓటు వేసి వెళ్లిపోయింది. ఆ తరువాత రెండోసారి ఓటు వేయడానికి వచ్చినప్పుడు యువతి చేతికి సిరా కనిపించడంతో ఎన్నికల అధికారులకు దొరికిపోయింది. పోలింగ్ బూత్ నుంచి పారిపోతుండగా ఆ యువతిని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనపై సంతోష్ నగర్ పోలీసులకు పిర్యాదు చేశారు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఫాతిమా. ప్రిసైడింగ్ ఆఫీసర్ పిర్యాదు మేరకు 132 RP ACT, 171 F, 188 IPC సెక్షన్స్ కింద యువతిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. . దొంగ ఓటు యత్నంపై రాత్రి వరకు పోలీస్ స్టేషన్ లో హల్ చల్ చేశారు బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లత . ఆమె ఒత్తిడి మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
