తీన్మార్ మల్లన్న కస్టడీ పిటిషన్ ను కొట్టేసిన కోర్టు

తీన్మార్ మల్లన్న కస్టడీ పిటిషన్ ను కొట్టేసిన కోర్టు

తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌ను.. 7 రోజులు పాటు కస్టడీకి ఇవ్వాలంటూ సికింద్రాబాద్ కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై  కోర్టు విచారించింది. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న తరపు న్యాయవాది ఉమేష్ చంద్ర తన వాదనలు విన్పించారు. ఇప్పటికే ఈ కేసులో తీన్మార్ మల్లన్నతో పాటు.. 19 మంది సాక్షులను విచారించారని..ప్రత్యేకంగా విచారించాల్సిన అవసరం లేదని కోర్టుకు తెలిపారు. అంతేకాదు..మల్లన్నను కస్టడీకి ఇస్తే లా అండ్ ఆర్డర్ సమస్య తెలెత్తే అవకాశం ఉందని.. ఆయనకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలా ఉందని గుర్తు చేశారు. పిటిషనర్ వాదనలతో  ఏకీభవించిన కోర్టు.. కష్టడీ  పిటిషన్ ను తిరస్కరించింది.

డబ్బుల కోసం ఓ వ్యక్తిని బెదిరించిన కేసులో అరెస్టైన తీన్మార్ మల్లన్నకు  14 రోజులు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు.