పండుగ ప్రత్యేక బస్సులకు అదనపు ఛార్జీల్లేవు

పండుగ ప్రత్యేక బస్సులకు అదనపు ఛార్జీల్లేవు

దసరా పండుగ సందర్భంగా నడిపే బస్సులకు ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని TSRTC ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. అంతేకాదు.. ఇక ముందు తెలంగాణ రాష్ట్రంలో అదనపు ఛార్జీలు ఉండవని తెల్చి చెప్పారు. గడిచిన ఐదు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1.30 కోట్ల మంది ప్రయాణికులను TSRTC సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిందన్నారు. 

ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ప్రయాణికుల సౌకర్యం భధ్రతే ధ్యేయంగా ఈ పండుగ సమయంలో తాము ఆర్టీసీ సేవలు అందిస్తున్నామని తెలిపారు సజ్జనార్. ఆర్టీసీలో ప్రయాణిస్తూ ప్రయాణీకులు చూపించే ఆదరాభిమానాలే సంస్థ పురోభివృద్ధికి ఎంతగానో తోడ్పాటునందిస్తాయని తాము ఆకాంక్షిస్తున్నామన్నారు. అందరు ప్రతి ప్రయాణాన్ని ఆర్టీసీ బస్సులో చేసి.. సురక్షితంగా గ్యమస్థానాలకు చేరుకోవాలని సజ్జనార్ కోరారు.

దసరా పండగను పురస్కరించుకుని లక్షలాది మంది ప్రజలు తమ తమ స్వగ్రామాలకు తరలివెళుతున్నారు. ప్రజలు ఎక్కువగా ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణిస్తుండటంతో బస్సులు కిటకిటలాడుతున్నాయి.