Gorre Puranam Teaser: రెండు వ‌ర్గాల మ‌ధ్య చిచ్చు పెట్టిన గొర్రె.. డిఫ‌రెంట్ జాన‌ర్‌తో వస్తున్న సుహాస్

Gorre Puranam Teaser: రెండు వ‌ర్గాల మ‌ధ్య చిచ్చు పెట్టిన గొర్రె.. డిఫ‌రెంట్ జాన‌ర్‌తో వస్తున్న సుహాస్

టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు సుహాస్(Suhas) ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ప్రసన్నవదనం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సరికొత్త కథా, కథనాలతో వచ్చిన  ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు మరో వినూత్న కథతో ఆడియన్స్ ముందుకు రానున్నాడు సుహాస్. అదే గొర్రె పురాణం.

బాబీ ద‌ర్శ‌క‌త్వంలో వస్తున్న ఈ సినిమా నుండి తాజాగా టీజర్ విడుదల చేశారు మేకర్స్. వినూత్న కథతో వస్తున్న ఈ టీజర్ చాలా కొత్తగా ఉంది. ఇప్పుడొక మీకొక బ్రేకింగ్ న్యూస్.. ఒక గ్రామంలో రెండు వ‌ర్గాల మ‌ధ్య ఒక గొర్రె చిచ్చు పెట్టింది.  అనే వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అయ్యింది ఈ టీజర్. తరువాత.. ఆ గొర్రె మాది అంటే మాది అని అంటూ హిందూ, ముస్లింలు వాదించుకుంటారు. అలా చిన్నగా మొద‌లైన గొడవ గ్రామ స‌మ‌స్య‌గా మారుతుంది. ఇక సుహాస్ జైల్లో ఖైదీలా కనిపించారు. మరి సుహాస్ కి ఆ గొర్రె పిల్లకి ఏమైనా సంబంధం ఉందా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ టీజర్ తో సినిమాపై మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. మరి మరో కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్నీస్ సాధిస్తుందో చూడాలి.