అక్షయ తృతీయ రోజున గ్రహాల మార్పు.. మేషరాశిలోకి బుధుడు.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..

అక్షయ తృతీయ రోజున గ్రహాల మార్పు.. మేషరాశిలోకి బుధుడు.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..

జ్యోతిష్యం ప్రకారం, మే మాసం చాలా ప్రత్యేకమైంది. ఈ నెలలో గురుడు, సూర్యుడు, బుధుడు, శుక్రుడు తమ స్థానాలను మారనున్నారు. మే మాసం ప్రారంభంలోనే గురుడు వృషభరాశిలో సంచారం చేయనున్నారు. మే 10వ తేదీన బుధుడు ...మేషరాశిలోకి ప్రవేశిస్తాడు.  ఈ శుభయోగాల ప్రభావంతో కొన్ని రాశుల వారికి  రాజయోగం ఏర్పడి  జాక్‌పాట్ కొట్టనున్నారు. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం  దీని  ప్రభావంతో ద్వాదశ రాశులకు ఏ మేరకు శుభ ఫలితాలు...ఏ రాశి వారికి  ప్రతికూల ఫలితాలు రానున్నాయనే పూర్తి వివరాలను తెలుసుకుందాం.

మేష రాశి(Aries):  బుధుడు ...మేషరాశిలో సంచారం వలన ఈ రాశి వారికి  మే (2024)  నెలలో ఎవరితోనూ గొడవ పడకూడదు. ఉద్యోగులకు సానుకూల ఫలితాలొస్తాయి. అయితే మీ పనులను పూర్తి చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయితే వ్యాపారులకు ఈ సమయం మంచిగా ఉంటుంది. మీకు ఆర్థిక పరంగా శుభ ఫలితాలొస్తాయి. మీ ప్రేమ జీవితంలో ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో కొంత ఆందోళన ఉంటుంది. మీ తండ్రితో సంబంధాలు దెబ్బ తినొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వృత్తి పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. 

వృషభ రాశి(Taurus): ఈ రాశి వారికి బుధుడు ...మేషరాశిలో సంచారం వలన  కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులు మంచి విజయం సాధిస్తారు. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో అద్భుతమైన ఫలితాలొస్తాయి. అయితే అహంకారంతో ఉండకూడదు. మీలో కొందరికి ఉద్యోగ బాధ్యతలు మారడం వల్ల బదిలీ కావొచ్చు. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. వ్యాపార భాగస్వాములతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాలి. ఆరోగ్య సంబంధిత ఖర్చులు పెరగొచ్చు. మీరు చాలా విషయాల్లో సంతోషంగా గడుపుతారు.

మిధున రాశి(Gemini):  బుధుడు ...మేషరాశిలోకి మారడం వలన ఈ రాశి వారికి  ఉద్యోగులకు సానుకూల ఫలితాలొస్తాయి. ఈ నెలలో మీరు ధైర్యంగా ముందడుగు వేయొచ్చు. మీలో కొందరు ఉన్నత స్థానాలను అధిరోహించే అవకాశం ఉంది. మరోవైపు మీకు సహోద్యోగులు ఇబ్బంది పెట్టొచ్చు. కాబట్టి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు విదేశీ మార్కెట్ నుంచి లాభపడతారు. ఆర్థిక పరంగా మీరు అనేక సంక్షోభాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ ప్రేమ భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. మీకు పాత కుటుంబ కష్టాలు మళ్లీ తలెత్తొచ్చు.

కర్కాటక రాశి(Cancer):  ఈ రాశి వారికి మే నెలలో కొన్ని హెచ్చు తగ్గులు ఉండొచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు కష్టపడి పని చేయాలి. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు కొత్త వ్యక్తులను కలిసే అవకాశాన్ని పొందుతారు. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. దీర్ఘకాలిక పోర్ట్ ఫోలియోలో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి ప్రయోజనాలు దక్కుతాయి. వ్యక్తిగత విషయంలో మీ భాగస్వామితో అపార్థాలు ఉండొచ్చు. కుటుంబ సమస్యలకు సంబంధించి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకోండి.

సింహ రాశి(Leo): బుధుడు ...మేషరాశిలోకి మారడం వలన  ఈ రాశి వారికి మే నెలలో కుటుంబ జీవితంలో అద్భుతంగా ఉంటుంది. అయితే పెట్టుబడుల విషయంలో తొందరపడకూడదు. స్టాక్ మార్కెట్లో తెలివిగా పెట్టుబడి పెట్టాలి. కొత్త వ్యూహాలను అమలు చేసేందుకు మీ తెలివితేటలను ఉపయోగించాలి. సీనియర్ సిటిజన్లు మీ సూచనలను అభినందిస్తారు. మీరు గాయపడే అవకాశం ఉన్నందున డ్రైవింగ్ మానుకోవాలి. మీకు విశ్వాసం లేకపోవడం, పెరిగిన అభద్రత కారణంగా ప్రేమ, వివాహం కష్టమవుతుంది. భూమి, భవనాల కొనుగోలు, విక్రయాలకు సంబంధించి ప్రణాళిక రూపొందించనున్నారు. ఈ సమయంలో, సన్నిహితులతో కొన్ని సైద్ధాంతిక విభేదాలు ఉండొచ్చు. మీ ఆరోగ్యం కూడా సాధారణంగా ఉంటుంది.

కన్య రాశి(Virgo): ఈ రాశి వారికి బుధుడు ...మేషరాశిలో సంచారం వలన కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వీటిని మీరు చాలా సహనంతో అధిగమించాలి. మీకు కొన్ని కొత్త బాధ్యతలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. వ్యాపారులు కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ వ్యాపార విస్తరణ ప్రణాళికలను పెండింగులో ఉంచాలి మీ సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీ కుటుంబ జీవితంలో చిన్న చిన్న విభేదాలు పెద్దగా మారొచ్చు. మీ తల్లి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి.

తులా రాశి (Libra) : ఈ రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. అయితే మీరు చేసే పనుల్లో విజయం సాధిస్తారు. ఉన్నతాధికారులు మిమ్మల్ని విశ్వసిస్తారు. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి ఫలితాలొస్తాయి. ఆస్తుల క్రయవిక్రయాలు, స్వాధీనానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవచ్చు. మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి మీ భాగస్వామితో సమయాన్ని వెచ్చించాలి. ఆరోగ్యంగా ఉండేందుకు వ్యాయామం చేయాలి. మీ వ్యాపారంలో కూడా అభివృద్ధి ఉంటుంది. మీరు ఇప్పటికే ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే, దాని గురించి నిజాయితీగా ఉండండి, లేకపోతే పరిస్థితి మరింత దిగజారొచ్చు. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే మీ జీవిత భాగస్వామి భావాలను గౌరవించాలి.

వృశ్చిక రాశి(Scorpio):  ఈ రాశి వారికి ఈ మాసంలో కెరీర్ పరంగా అద్భుతమైన పురోగతి లభిస్తుంది. వ్యాపారులకు మంచి అవకాశాలొస్తాయి. మీరు కొత్త ప్రణాళికతో ముందుకు సాగుతారు. ఈ కాలంలో మీరు పెట్టుబడి పెట్టాలన్న నిర్ణయం సరైందని రుజువు అవుతుంది. మీకు కొన్ని కొత్త ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది. మీరు అనవసర విషయాలపై సమయం, డబ్బు వృథా చేయకుండా ఉండాలి. మీ వ్యక్తిగత జీవితంలో లోతైన ఒంటరి అనుభూతిని అనుభవిస్తారు. మీకు ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు తలెత్తుతాయి.

ధనస్సు రాశి (Sagittarius):  ఈ రాశి వారికి ఈ నెలలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కెరీర్ పరంగా ఉన్న ఆందోళనలన్నీ తొలగిపోతాయి. మీరు పోటీ పరీక్షల్లో విజయం సాధించొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు తమ ఉద్యోగం మార్పు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. దీని వల్ల మీకు నష్టం జరగొచ్చు. పరస్పర విశ్వాసం లేకపోవడం వల్ల ప్రేమలో ఒడిదుడుకులు ఎదురవుతాయి. మీ కుటుంబ జీవితంలో కలహాలు తగ్గుతాయి. నెల ప్రారంభంలో, భూమి మరియు ఆస్తికి సంబంధించిన ప్రధాన వివాదాలు పరిష్కరించబడినందున లేదా కొనుగోలు మరియు అమ్మకాల లక్ష్యం నెరవేరినందున మీరు ఉపశమనం పొందగలరు. కుటుంబ సమేతంగా సుదూర లేదా తక్కువ దూర తీర్థయాత్రలు కూడా సాధ్యమే. ఈ కాలంలో వృత్తి, వ్యాపారాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది.

మకర రాశి(Capricorn): ఈ రాశి వారికి బుధుడు ...మేషరాశిలోకి మారడం వలన మకర రాశి వారు  చేసే పనుల్లో కొన్ని ఒడిదుడుకులు ఎదురుకావొచ్చు. మీ పనిలో ప్రత్యర్థుల జోక్యం కారణంగా అడ్డంకులు ఉండొచ్చు. మీరు కొత్త వ్యాపార ప్రణాళికలను అమలు చేస్తే మంచి విజయం సాధిస్తారు. మీ ఆర్థిక భద్రతకు హామీ ఇవ్వబడుతుంది. మీరు పూర్వీకుల ఆస్తి నుంచి ప్రయోజనం పొందుతారు. మీ ప్రియమైన భాగస్వామితో మీ భవిష్యత్తును ప్లాన్ చేసుకోవడానికి ఇది మంచి సమయం. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు మీ కుటుంబ సభ్యులను సంప్రదించాలి.

కుంభ రాశి(Aquarius):  ఈ రాశి వారికి ఈ నెలలో కొన్ని విషయాల్లో గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని మార్చుకునేందుకు ప్లాన్ చేయొచ్చు. కొత్తగా వ్యాపారం చేసే వారికి మంచి అవకాశాలొస్తాయి. ఈ కారణంగా మంచి బహుమతులు లభిస్తాయి. మరోవైపు మీ జీవిత భాగస్వామితో విభేదాలు ఉండొచ్చు. మీ కుటుంబ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే, ప్రతి సందర్భంలోనూ మీరు సమదృష్టితో ఉండాలి. ఉద్యోగులు కార్యాలయంలో ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా లేదా తొందరపడి ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవడంలో తప్పు చేయొద్దు. కెరీర్ మరియు వ్యాపారం మొదలైన వాటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు గందరగోళ స్థితిలో ఉన్నట్లయితే, మీ శ్రేయోభిలాషుల నుండి సలహా తీసుకోవడం మర్చిపోవద్దు. మీ జీవిత భాగస్వామితో సంబంధాలు సాధారణంగా ఉంటాయి.

మీన రాశి(Pisces):  బుధుడు ...మేషరాశిలో సంచారం వలన  ఈ నెలలో కొంత ఉత్సాహం ఉంటుంది. మీరు భావోద్వేగ నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ప్రేవేట్ రంగంలో ఉద్యోగం చేసే వారికి మంచి ఉద్యోగాలొస్తాయి. వ్యాపారానికి సంబంధించిన వ్యక్తులు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి ఫలితాలొస్తాయి. మీ భాగస్వామితో కలిసి విలువైన సమయాన్ని గడుపుతారు. నెల ప్రారంభంలో, కుటుంబానికి సంబంధించి కొన్ని పెద్ద సమస్యలు తలెత్తుతాయి. బంధువుల సహకారంతో వీటిని పరిష్కరించుకుంటే మంచిది. మీ పనిలో విజయం సాధించడానికి అదృష్టం మీద ఆధారపడే బదులు మీకు అదనపు కృషి అవసరం. నెల మధ్యలో, విద్యార్థులకు విద్యపై ఆసక్తి పెరుగుతుంది. ఈ సమయంలో వారు ఎక్కువ సమయం సరదాగా గడుపుతారు. పిల్లలకు సంబంధించిన ఏదైనా పెద్ద ఆందోళన మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మీ ప్రత్యర్థులు నెల ద్వితీయార్థంలో యాక్టివ్‌గా మారొచ్చు. మరోవైపు మీరు శత్రువుల పట్ల మీరు పూర్తిగా జాగ్రత్తగా ఉండాలి. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి.