Aashu Reddy: పేరు మార్చుకున్న బోల్డ్ బ్యూటీ.. ఇకనైనా కలిసొచ్చేనా?

Aashu Reddy: పేరు మార్చుకున్న బోల్డ్ బ్యూటీ.. ఇకనైనా కలిసొచ్చేనా?

ఈ మధ్య చాలా మంది టైం కలిసి రావడం లేదని న్యూమరాలజీని ఫాలో అవుతున్నారు. సామాన్య ప్రజల నుండి స్టార్స్ వరకు చాలా మంది ఈ థియరీని ఫాలో అవుతున్నారు. న్యూమరాలజీ ప్రకారం పేరులో మార్పు చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుందని వారి నమ్మకం. అందుకే.. ఈ మధ్య పేరు మార్చుకోవడం అనే మాట బాగా వినిపిస్తోంది. తాజాగా ఈ లిస్టులోకి మరో బ్యూటీ కూడా చేరిపోయింది. ఆమె మరెవరో కాదు అషు రెడ్డి. 

అవును.. సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన ఏ అమ్మడు రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ తరువాత సంచలనంగా మారింది. ఆయనతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి లాక్ అఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఆ ఫేమ్ తోనే రెండుసార్లు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే.. అశు చేసే పనులు సంచలనం అవుతున్నాయి కానీ, ఆమెకు అనుకున్నంత క్రేజ్ రావడంలేదు. ఎన్నిరకాలుగా ట్రై చేసిన ఆమెకు ఇప్పటివరకు బ్రేక్ రాలేదు. 

అందుకే ఫైనల్ గా న్యూమరాలజీని నమ్ముకుంది. తాజాగా ఆమె పేరును అషు రెడ్డి(Ashu reddy) నుండి ఆషురెడ్డి(Aashu reddy)గా మార్చుకుంది. తన పేరులో మరి ఏ(A)లెటర్ ని యాడ్ చేసుకుంది. తన సోషల్ మీడియాలో కూడా మార్చుకున్న పేరుని అప్డేట్ చేసింది ఆషురెడ్డి. మరి ఈ మార్పు తరువాతనైనా ఆమెకు అవకాశాలు వస్తాయా అనేది చూడాలి. ఇక ఆషు రెడ్డి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె యేవమ్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.