అమీర్ పేటలో దారుణం..జాబ్ కోసం వెళ్లిన యువతిపై అత్యాచార యత్నం

అమీర్ పేటలో దారుణం..జాబ్ కోసం వెళ్లిన యువతిపై అత్యాచార యత్నం

హైదరాబాద్ అమీర్ పేటలో దారుణం జరిగింది. జాబ్ ఇంటర్వ్యూ కు వచ్చిన ఓ యువతిపై అత్యాచారయత్నం చేశాడు సాఫ్ట్ వేర్ సంస్థ మేనేజర్.   వివరాల్లోకి వెళితే అమీర్ పేటలో టెక్ ఫ్లో అనే సాఫ్ట్ వేర్  సంస్థలో ఓ యువతి జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్లింది.  

అప్పుడు ఆ సంస్థ మేనేజర్ నవీన్ దాండొత్కర్ ఆ యువతిని ఇంటర్వ్యూ చేసి  సెలెక్టు అయ్యావని చెప్పాడు. అయితే ఆ యువతిని ఆఫీస్ సిమ్ కార్డు ఇచ్చే సాకుతో ఇంటికి పిలిపించుకున్నాడు. అతని మాటలను నమ్మిన యువతి అతని ఇంటికి వెళ్ళింది. ఇంటికి వచ్చిన యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు మేనేజర్  నవీన్.  యువతి ఇచ్చిన కాంప్లెంట్ తో  కేసు నమోదు చేసి  నిందితుడు నవీన్ ను అరెస్టు చేశారు మధురానగర్ పోలీసులు.