ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలి

ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలి
  • బీజేపీ మజ్దూర్ మోర్చా సిటీ కమిటీ చైర్మన్ ఊదరి గోపాల్

ఎల్​బీనగర్, వెలుగు: తెలంగాణ వచ్చాక ఔట్​ సోర్సింగ్ అన్న పదమే ఉండదన్న కేసీఆర్‌‌‌‌.. ఇప్పుడు వారిని ఎందుకు పట్టించుకోవట్లేదని  బీజేపీ మజ్దూర్ మోర్చా సిటీ కమిటీ చైర్మన్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ఊదరి గోపాల్ ప్రశ్నించారు. శానిటేషన్ వర్కర్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. బుధవారం బీజేపీ మజ్దూర్ మోర్చా ఆధ్వర్యంలో సరూర్​నగర్​లోని బల్దియా ఎల్ బీనగర్ జోనల్ కమిషనర్ ఆఫీసు వద్ద  ఔట్​సోర్సింగ్ కార్మికులతో భారీ ధర్నా నిర్వహించారు.

కార్యక్రమంలో ఊదరి గోపాల్ పాల్గొని మాట్లాడారు. ఔట్​సోర్సింగ్ కార్మికులను ఇప్పటివరకు పర్మినెంట్ చేయకపోవడం దుర్మార్గమన్నారు. వారిని వెంటనే పర్మినెంట్ చేసి, హెల్త్ కార్డులు జారీ చేయాలని డిమాండ్‌‌ చేశారు. ఔట్​సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే సిటీ వ్యాప్తంగా పనులు నిలిపివేస్తామని హెచ్చరించారు.