- మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన 5డీగా మారిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. 5డీ అంటే డైవర్షన్, డిమాండ్, డిమాలిషన్, డెట్, డిఫాల్ట్ అని అభివర్ణించారు. అప్పట్లో ఆరు గ్యారెంటీలు అన్నారని, ఇప్పుడు అవి ఆరు మోసాలయ్యాయని ఆరోపించారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు.
రేవంత్ రెడ్డి పాలన ‘పర్ఫార్మెన్స్ వీక్.. పబ్లిసిటీ పీక్’ అన్నట్టుగా ఉందని తెలిపారు. తెలంగాణ సంపదను మూటలు కట్టి ఢిల్లీకి, కేరళకు తరలిస్తున్నారని ఆరోపించారు. కాగ్, ఆర్బీఐ నివేదికల ప్రకారం ఈ ప్రభుత్వం ఏడాదిలో 365 రోజులకు గాను 363 రోజులు అప్పుల మీదనే నడిచిందని ఎద్దేవా చేశారు.
