ఇంట్లో ఎక్కువమందిని ఇబ్బందిపెట్టేవి బల్లులు. వీటిని చూస్తేనే భయపడేవాళ్లు చాలామంది. ఇవి ఇంట్లో ఉండకూడదనుకుంటే కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు.
- పెప్పర్ స్ప్రే చేస్తే బల్లులు దూరం వెళ్లిపోతాయి. దీనికోసం మార్కెట్లో దొరికే పెప్పర్ స్ప్రే వాడితే చాలు. లేదా మిరియాలు పొడి చేయాలి. ఒక చిన్న బాటిల్లో నీళ్లుపోసి, మిరియాల పొడి కలపాలి. బల్లులపై లేదా అవి ఉన్న చోట పెప్పర్ వాటర్ స్ప్రే చేసినా చాలు. బల్లులు దూరంగా వెళ్తాయి. మిరియాలు బల్లులకు అలర్జీ కలిగిస్తాయి. మిరియాలు లేకుంటే, చిల్లీ ఫ్లేక్స్, చిల్లీ పౌడర్ కలిపి కూడా ఇలా స్ప్రే చేయొచ్చు.
- బల్లులు ఎక్కువగా వచ్చే చోట ఉల్లి, వెల్లుల్లిని ఉంచితే అవి రావు. ఆనియన్స్ను చిన్న ముక్కలుగా కట్ చేసి లేదా వెల్లుల్లి రెబ్బల్ని ఒలిచి, గిన్నెలో ఉంచి బల్లులు ఎక్కువగా తిరిగే చోట ఉంచాలి. వీటినుంచి వచ్చే వాసనకు బల్లులు దూరంగా వెళ్తాయి.
- కోడిగుడ్డు పెంకుల్ని ఉంచిన చోట కూడా బల్లులు ఉండవు. వీటి నుంచి వచ్చే వాసనను బల్లులు భరించలేవు.
- బల్లులు చల్లగా ఉండే ప్రదేశాల్లో ఉండలేవు. రూమ్లో ఏసీ లేదా కూలర్ ఉంటే, రూమ్ చల్లగా ఉంచండి. అంతే బల్లులు ఆ ప్లేస్ వదిలి వెళ్లిపోతాయి.
- నెమలి ఈకలు కూడా బల్లుల్ని దూరంగా ఉంచేందుకు ఉపయోగపడతాయి. నెమలి ఈకలున్న చోట బల్లులు ఉండవు.
