భారత మార్కెట్లో కాలుమోపిన క్రాస్ టవర్

 భారత మార్కెట్లో కాలుమోపిన క్రాస్ టవర్
  • క్రిప్టో కరెన్సీ బిజినెస్ లో 11వ స్థానంలో భారత్

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రముఖ డిజిటల్‌ కరెన్సీ ఎక్స్ఛేంజీ క్రాస్‌ టవర్‌ భారత మార్కెట్‌లో కాలుమోపింది. క్రిప్టో కరెన్సీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోయినా అమెరికా కంపెనీ మాత్రం భారత్ లో కాలుమోపడమే కాదు ఆసియా దేశాలకు విస్తరించేలా ప్లాన్ చేసుకుంది. భారత్ లో తొలుత 35 మంది ఉద్యోగులతో ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించిన క్రాస్ టవర్ రాబోయే ఆరేడు నెలల్లో సిబ్బంది సంఖ్యను వంద మందికిపైగా పెంచుకుంటామని చెబుతోంది.

భారత దేశంలో క్రిప్టో కరెన్సీ బిజినెస్ గత ఏడాది ఏప్రిల్ లో 9.23 కోట్ల డాలర్లు నమోదు కాగా.. ఇప్పుడు 660 కోట్ల డాలర్లకు చేరినట్లు బ్లాక్‌చైన్‌ డేటా సంస్థ ఛైన్‌ అనాలిసిస్ విశ్లేషించింది. క్రాస్ టవర్ అడుగుపెట్టడానికి ముందే  2019లోనే అమెరికాకు చెందిన బినాన్స్‌ భారత మార్కెట్‌లో ప్రవేశించిన వచ్చిన విషయం తెలిసిందే. ఎంత అయోమయం ఉన్నా మరో వైపు  క్రిప్టో కరెన్సీ వ్యాపారం రోజు రోజుకూ పెరుగుతుండడం.. భారత్‌ 11వ స్థానంలో నిలుస్తుండడం వల్ల క్రాస్ టవర్ భారత్‌ కేంద్రంపై దృష్టి సారించి అడుగుపెట్టినట్లు అంచనా వేస్తున్నారు. భారత్ కేంద్రంగా పరిసర దేశాల్లోకి కూడా విస్తరిస్తామని క్రాస్‌ టవర్‌ ఇండియా సహ వ్యవస్థాపకుడు, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ కపిల్‌ రాఠి వెల్లడించారు.