డ్రెస్ కోడ్ చేంజ్ చేసిన జొమాటో ఇక నుంచి అందరూ అదే రంగు ధరించాలి..

డ్రెస్ కోడ్ చేంజ్ చేసిన జొమాటో ఇక నుంచి అందరూ అదే రంగు ధరించాలి..

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సీఈఓ కీలక ప్రకటన చేశారు. రెగ్యులర్, ప్యూర్ వెజ్ ఫుడ్ డెలివరీ రైడర్లందరూ ఇప్పుడు ఎరుపు రంగు చొక్కాలనే వేసుకుంటారని ప్రకటించారు. తాము శాకాహారుల కోసం ప్రత్యేకంగా తెచ్చిన ఫ్యూర్ వెజ్ ను అందించేందుకు డెలివరీ బాయ్స్ కు ఆకు పచ్చ రంగు చొక్కాలను ఇచ్చామని కానీ ఇక నుంచి వాటిని రద్ధు చేస్తున్నామని తెలిపారు. రెగ్యులర్ ఫ్లీట్, శాకాహారుల కోసం ఎరుపు రంగు చొక్కాలనే ధరిస్తారని ఎక్స్ వేదికగా తెలిపారు. 

 మంగళవారం మార్చి 19, 2024 నాడు జొమాటో యొక్క కొత్త 'ప్యూర్ వెజ్ ఫ్లీట్' 100% శాఖాహార ఆహార ప్రాధాన్యతను కస్టమర్లకు అందిస్తుంది. ఈ సేవలో భాగంగా, డెలివరీ రైడర్లు మొదట్లో గ్రీన్ యూనిఫాం ధరించాల్సి ఉంటుంది. దీన్ని ఇప్పుడు రద్దు చేశారు. ప్యూర్ వెజ్ ఫ్లీట్ ను లాంచ్ చేసిన కొన్ని గంటలకే రద్ధు చేస్తున్నట్టు ప్రకటించడంతో చర్చనీయాంశం అయ్యింది.