
మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్, ఎన్‌సిపి నాయకురాలు రూపాలి చకంకర్ అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. లోక్ సభ ఎన్నికల వేళ ఆమె పోలింగ్ బూత్‌లలో ఒక ఈవీఎంకు హారతి ఇచ్చారు. రూపాలి చకంకర్ కు ఖడక్‌వాసలా ప్రాంతంలో ఓటు ఉంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈ రోజు ఉదయం 7గంటలకు ఆమె పోలింగ్ బూతుకు చేరుకున్నారు. ఓటు వేసేముందు ఆమె పల్లెంలో హారతి వెలిగించి పూజలు చేశారు. ః
దీంతో ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందికి రావడంతో స్వయంగా ఎన్నికల అధికారి ఆమెపై ఫిర్యాదు చేశారు, రూపాలీ చకంకర్‌పై పూణేలోని సింహగడ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో నెటిజన్లు ఆమెపై తెగ ట్రోల్ చేస్తున్నారు. కాగా రాష్ట్రంలోని 11 నియోజకవర్గాల్లో ఈరోజు మూడో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది.