కుంభమేళా.. ఉత్తరాఖండ్‌‌కు కేంద్రం హెచ్చరిక

కుంభమేళా.. ఉత్తరాఖండ్‌‌కు కేంద్రం హెచ్చరిక

న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా వ్యాప్తి ఎక్కువవుతోంది. మహారాష్ట్ర, పంజాబ్‌‌‌తోపాటు పలు రాష్ట్రాల్లో కొవిడ్-19 వేగంగా వ్యాప్తి అవుతోంది. త్వరలో ఉత్తరాఖండ్‌‌లో కుంభమేళా జరగనుంది. ఈ నేపథ్యంలో కరోనా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని, లేకుంటే కేసుల సంఖ్య విపరీతంగా పెరగొచ్చునని ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి కేంద్రం హెచ్చరించింది.

కుంభమేళాకు దేశంలోని నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున పెద్ద ఎత్తున మెడికల్ కేర్, పబ్లిక్ హెల్త్ అరేంజ్‌మెంట్స్‌‌ చేసుకోవాలని కేంద్రం తెలిపింది. ఈ మేరకు తమ నుంచి అవసరమైన సాయం అందిస్తామని పేర్కొంది. కరోనా టెస్టులను పెంచడం, ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్ పాటించడం తప్పనిసరి అని హెల్త్ మినిస్ట్రీ ఓ ప్రకటనలో తెలిపింది. పుణ్య స్నానాల ముందు, తర్వాత ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కు కరోనా టెస్టులు చేయాలని ఉత్తరాఖండ్ చీఫ్ సెక్రటరీకి రాసిన లేఖలో కేంద్ర హెల్త్ సెక్రటరీ రాజేశ్ భూషణ్ సూచించారు.