104 ఏళ్ల వయస్సులో అవార్డ్… అది అందుకోవడంలోనూ స్పెషల్..

104 ఏళ్ల వయస్సులో అవార్డ్… అది అందుకోవడంలోనూ స్పెషల్..

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా  కేంద్ర ప్రభుతం ఆదివారం  నారీ శక్తి పురస్కారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దేశంలో వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరచిన మహిళలకు ఈ పురస్కారాలు అందజేసే కార్యక్రమం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో  రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పాల్గొని.. పురస్కారాలకి ఎంపికైన మహిళామణులకు అవార్డులను ప్రధానం చేశారు.

అవార్డులు అందుకున్న వారిలో 104 ఏళ్ల మన్ కౌర్ అందరీ దృష్టిని ఆకర్షించింది. దేశంలోlo అత్యంత వయోవృద్ధ అథ్లెట్‌గా అవార్డుకు ఎంపికైన ఆమెను..  స్టేజీ పై తన పేరును పిలవగానే..  అందరూ ఆశ్చర్యపోయేలా ఎంతో యాక్టివ్ గా చకచకా నడుస్తూ రాష్ట్రపతి వద్ద పురస్కారాన్ని అందుకుంది. నూరేళ్లు దాటిన తర్వాత కూడా ఎంతో చురుగ్గా అవార్డును తీసుకునేందుకు వస్తున్న ఆమెను చూసి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దంపతులు, మంత్రులు నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీలు చప్పట్లతో స్వాగతం పలికారు. అథ్లెట్ గా విశేష ప్రతిభ కనబరిచిన మాన్ కౌర్ కు రాష్ట్రపతి తన చేతుల మీదుగా అవార్డును ప్రధానం చేశారు. అవార్డును అందుకున్న తర్వాత కూడా తనకు క్రీడా విభాగంలో ఈ పురస్కారం వచ్చిందన్న విషయాన్ని గుర్తు చేస్తూ మాన్ కౌర్.. పరుగు తీసినట్టుగా స్టేజీ నుంచి క్రిందకు దిగి వెళ్లారు. క్రింద చూస్తున్న జనమంతా ఆమెను చప్పట్లతో అభినందించారు.

పదేళ్ల కిందటి వరకు క్రీడల సంగతి తెలియని మాన్ కౌర్ కు తన కొడుకు, అథ్లెట్ అయిన గురుదేవ్ (78) ప్రోత్సాహంతో ఆమె మైదానంలోకి దూకింది. గురుదేవ్ కూడా అమ్మతో కలసి ఈ పోటీలో పాల్గొంటుంటాడు. ఈ బామ్మకు సోషల్ మీడియాలో చాలామంది అభిమానులు ఉన్నారు. ఆమె భారత్‌లో అత్యంత వయోవృద్ధ అథ్లెట్‌గానూ చరిత్ర సృష్టించింది.