-
పాలిసెట్ ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ పూర్తి
-
వచ్చే 15 నుంచి ఫస్టియర్ క్లాసులు ప్రారంభం
హైదరాబాద్, వెలుగు : పాలిటెక్నిక్ కాలేజీల్లో ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ ప్రక్రియ ముగిసింది. మొత్తం 21,367 మందికి సీట్లు అలాట్ చేశామని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఆదివారం ప్రకటించారు. పాలిసెట్లో మొత్తం 80,358 మంది క్వాలిఫై కాగా, వీరిలో 25,160 మంది అడ్మిషన్ల కోసం ఆప్షన్లు పెట్టుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 29,396 సీట్లుండగా, వాటిలో 21,367 (72.69%) మందికి సీట్లు అలాట్ అయ్యాయి. 56 గవర్నమెంట్ కాలేజీల్లో 13,321 సీట్లుండగా 11,648 మందికి, 60 ప్రైవేట్కాలేజీల్లో 16,075 సీట్లకు గానూ 9,719 మందికి సీట్లు కేటాయించారు. ఈడబ్ల్యూఎస్ కోటాలో 580 మందికి సీట్లు అలాట్ చేశారు. సీట్లు పొందిన స్టూడెంట్లు ఈనెల 29లోగా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంది. కాగా, నాలుగు కాలేజీల్లో వందశాతం సీట్లు అలాట్ అయ్యాయి.
వచ్చేనెల 15 నుంచి క్లాసులు
జులై 15 నుంచి ఫస్టియర్ స్టూడెంట్లకు క్లాసులు ప్రారంభమవుతాయని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ తెలిపారు. వచ్చేనెల 7 నుంచి 14 వరకు ఓరియంటేషన్ క్లాసులు నిర్వహించనున్నట్టు చెప్పారు. సీట్లు అలాటైన స్టూడెంట్లు వచ్చేనెల 7 నుంచి 10 వరకు కాలేజీల్లో రిపోర్టు చేయాలని లేకపోతే సీట్లు రద్దు అవుతాయని వెల్లడించారు.
