PSL 2026: వరల్డ్ నెంబర్–1గా పాకిస్తాన్ సూపర్ లీగ్.. పీసీబీ చైర్మన్ సెల్ఫ్ డబ్బా 

PSL 2026: వరల్డ్ నెంబర్–1గా పాకిస్తాన్ సూపర్ లీగ్.. పీసీబీ చైర్మన్ సెల్ఫ్ డబ్బా 

PSL 2026: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో జరిగిన బోర్డు సమావేశం అనంతరం అతడు మాట్లాడుతూ..  PSL త్వరలోనే ప్రపంచంలోనే నెంబర్ వన్ లీగ్‌గా అవతరిస్తుందని సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు. కాగా ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో పెట్టుబడి పెట్టేందుకు PSL లీగ్ అత్యుత్తమ మార్కెట్‌గా మారిందన్నారు. అతి త్వరలోనే PSL అంతర్జాతీయంగా అగ్రస్థానానికి చేరుకుంటుందని జోస్యం చెప్పారు.

వివాదాల్లో చిక్కుకున్న PSL: 
ఒకవైపు లీగ్ అభివృద్ధి గురించి బోర్డు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, మరోవైపు ఆటగాళ్ల క్రమశిక్షణా రాహిత్యం, వివాదాలు PSLని తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ఇటీవల పలువురు స్టార్ ఆటగాళ్లపై PCB కఠిన చర్యలు తీసుకుంది.

* ఫఖర్ జమాన్ (బాల్ ట్యాంపరింగ్):
లాహోర్ ఖలందర్స్ ప్లేయర్ ఫఖర్ జమాన్ 'లెవల్– 3' నేరానికి పాల్పడినట్లు తేలింది. బంతి ఆకారాన్ని మార్చడానికి ప్రయత్నించి (Article 41.3 ఉల్లంఘన), కోడ్ ఆఫ్ కాండక్ట్ నియమాలను అతిక్రమించినందుకు అతనిపై రెండు మ్యాచులు ఆడకూండా బ్యాన్ విధించింది. 

►ALSO READ | IPL 2026: టాస్ గెలిచిన చెన్నై.. ఆర్సీబీదే ఫస్ట్ బ్యాటింగ్

* హసన్ అలీ (అభ్యంతరకరమైన సైగలు):
కరాచీ కింగ్స్ పేసర్ హసన్ అలీకి మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించారు. లాహోర్ ఖలందర్స్ బ్యాటర్ హసీబుల్లాను అవుట్ చేసిన తర్వాత, అభ్యంతరకరమైన సైగలు, భాషను ఉపయోగించినందుకు (Article 2.5 ఉల్లంఘన) ఈ శిక్ష విధించారు. హసన్ తన తప్పును అంగీకరించాడు.

* నసీమ్ షా (కాంట్రాక్ట్ ఉల్లంఘన):
స్టార్ బౌలర్ నసీమ్ షా తన సెంట్రల్ కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లంఘించినట్లు PCB క్రమశిక్షణా కమిటీ నిర్ధారించింది. అతడికి 2 కోట్ల రూపాయల (PKR) జరిమానా విధించారు. ఇక నసీమ్ షా సోషల్ మీడియా అడ్వైజర్‌ను PCB బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. ఇకపై ఏ ఆటగాడితోనూ అతను పని చేయడానికి వీల్లేదని బోర్డు స్పష్టం చేసింది.