CSK vs RCB: 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన CSK.. జోష్ లో ఆర్సీబీ

CSK vs RCB: 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన CSK.. జోష్ లో ఆర్సీబీ

CSK vs RCB: ఐపీఎల్ 2026లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో జరుగుతున్న పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3వికెట్లు మాత్రమే కోల్పోయి 250 పరుగులు చేసింది. దీంతో 251 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఎల్లో ఆర్మీకి ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. తొలి ఓవర్ నుంచే దూకుడు బ్యాటింగ్ ప్రారంభించిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (7) ఫస్ట్ ఓవర్ ఐదో బంతికి జాకబ్ డఫీ బౌలింగ్ లో దేవదత్ పడిక్కల్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కి చేరుకున్నాడు.  

ఇక రెండో ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ (1.2) లో ఆయూష్ మాత్రే (1) భారీ షాట్ ఆడగా, ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ క్యాచ్ పట్టుకోవడంతో డగౌట్ కి వెనుదిరిగాడు. ఆ తర్వాత డఫీ వేసిన మూడో ఓవర్లోనే సీఎస్కే స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. వరుసగా మూడో మ్యాచులో 9 పరుగులు చేసి మైదానం వీడాడు. 30 పరుగులకే కీలకమైన మూడు వికెట్లని  కోల్పోయి కష్టాల్లో పడిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. 

వరుసగా మూడు వికెట్లు కోల్పోయిన తర్వాత క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ అద్భుతమైన హాఫ్ సెంచరీ చేశాడు. కేవలం 24 బంతుల్లోనే 8 ఫోర్లు, 2 సిక్సులతో 50 పరుగులు చేసిన తర్వాత కృనాల్ పాండ్యా బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. మరోవైపు, బ్యాటింగ్ కి వచ్చిన కార్తీక్ శర్మ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. పాండ్యా బౌలింగ్ లో అభినందన్ సింగ్ కి క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. బ్యాటింగ్ కి వచ్చిన శివమ్ దూబే వచ్చి రాగానే  భారీ సిక్సుతో ఇన్సింగ్స్ స్టార్ట్ చేశాడు. ఆర్సీబీ బౌలర్లలో జాకబ్ డఫీ, కృనాల్ పాండ్యా చెరో రెండు వికెట్లు తీసుకోగా, భువనేశ్వర్ కుమార్ వికెట్ తీసుకున్నారు.