మాదాపూర్ లో షాకింగ్ ఇన్సిడెంట్.. ఆదివారం రాత్రి డీసీఎం లారీ బీభత్సం సృష్టించింది. స్కూటీని ఢీకొట్టి దాదాపు ఐదు కిలోమీటర్లు లాక్కెళ్లింది. గమనించిన యువకులు డీసీఎం లారీని వెంబడించి జూబ్లిహిల్స్ దగ్గర అడ్డుకున్నారు. ఈ ప్రమాదంలో స్కూటీపై వెళ్తు్న్న భార్యభర్తలు తీవ్రంగా గాయపడగా భార్య ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే..
ఆదివారం (ఏప్రిల్ 5) రాత్రి మాదాపూర్ లో ఈ ప్రమాదం జరిగింది. అబ్దుల్ బాసిత్ ,అయేషా (22) అనే భార్యభర్తలు స్కూటీపై వెళ్తుండగా, వేగంగా వచ్చిన డీసీఎం లారీ వారిని బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే వాహనాన్ని ఆపకుండా, స్కూటీని ముందు చక్రాల కిందనే దాదాపు 5 కిలోమీటర్ల మేర ఈడ్చుకుంటూ వెళ్ళింది. ఈ క్రమంలో దంపతులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. డీసీఎం కింద స్కూటీ ఇరుక్కుపోయి మంటలు వస్తున్నా డ్రైవర్ ఆపకపోవడంతో, స్థానిక యువకులు బైక్‌లపై వెంబడించి జూబ్లీహిల్స్ దగ్గర వాహనాన్ని అడ్డుకున్నారు. వెంటనే వాహన క్లీనర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించగా, డ్రైవర్ మాత్రం అక్కడి నుండి పరారయ్యాడు.
►ALSO READ | నా కొడుకు మృతిపై అనుమానాలున్నాయి.. నిండు సభలో కొంగు చాపి న్యాయం కోరిన ఓ తల్లి
తీవ్రంగా గాయపడిన భార్యాభర్తలను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భార్య అయేషా మృతిచెందింది. ఆమె భర్త బాసిత్ చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.
