దేశంలో ఒకటి కాదు 7 చోట్ల నిరసనలు.. మీడియా ఎందుకు చూపట్లేదు?: ఇన్‌స్టాగ్రామ్‌ను ఊపేస్తున్న మిలటరీ మ్యాన్ వీడియో!

దేశంలో ఒకటి కాదు 7 చోట్ల నిరసనలు.. మీడియా ఎందుకు చూపట్లేదు?: ఇన్‌స్టాగ్రామ్‌ను ఊపేస్తున్న మిలటరీ మ్యాన్ వీడియో!

సైనిక దుస్తులు (మిలటరీ యూనిఫాం) ధరించిన ఓ వ్యక్తి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది. భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం ఎన్నో ప్రజా ఉద్యమాలు, నిరసనలు జరుగుతున్నాయని... కానీ ఒక్క వార్తా ఛానెళ్లు కూడా వాటిని చూపించకుండా విస్మరిస్తున్నాయని ఆయన ఆరోపించారు. సుమారు 33 లక్షల  మంది ఫాలోవర్లు ఉన్న 'దీపక్ కుమార్' అనే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ నుండి ఈ వీడియో పోస్ట్ కాగా, ఇప్పటివరకు దీనిని దాదాపు 19 లక్షల మంది చూసారు. అయితే, ఈ వీడియోలో ఉన్న వ్యక్తి నిజంగానే సైనిక ఉద్యోగా లేదా అనే విషయాన్ని ఇంకా తెలియాల్సి  ఉంది.

వీడియోలో ప్రస్తావించిన 7 నిరసనల వివరాలు:
వీడియోలోని వ్యక్తి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న  నిరసనలను వరుసగా వివరించారు.  మొదటిది న్యూఢిల్లీలోని  జంతర్ మంతర్ వద్ద కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. రెండోది ఉత్తరాఖండ్లోని రిషికేశ్ రోడ్డు విస్తరణ పేరుతో దాదాపు 4,000 చెట్లను నరికివేయడాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

మూడోది గుజరాత్లో ఒక ప్రైవేట్ కంపెనీకి వ్యతిరేకంగా, వారి భూముల రక్షణ కోసం రైతులు పోరాటం చేస్తున్నారు. ఇక నాలుగోది మధ్యప్రదేశ్ లో కెన్-బెట్వా నదుల అనుసంధాన ప్రాజెక్టు వల్ల జరిగే నష్టాలపై స్థానిక ప్రజలు వ్యతిరేకత తెలుపుతున్నారు. ఇతర రాష్ట్రాలు రాజస్థాన్, గోవా, ఢిల్లీ, గుజరాత్ వంటి చాల చోట్లలో ప్రజలు వారి సమస్యలపై నిరసనలు తెలియజేస్తున్నా, వారి డిమాండ్లను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

టీవీ ఛానెళ్లపై తీవ్ర విమర్శలు
ఈ వీడియోలో ముఖ్యంగా వార్తా ఛానెళ్ల తీరును ఆయన తప్పుబట్టారు. "బికావ్ మీడియా" (అమ్ముడుపోయిన మీడియా) దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న నిజమైన సమస్యలను చూపించడం లేదని మండిపడ్డారు. ప్రజల ఆందోళనలను పక్కనబెట్టి... చైనా, పాకిస్తాన్, అమెరికా విషయాలు లేదా 'మెలోడీ చాక్లెట్ ధర' వంటి అనవసరమైన అంశాలపై చర్చలు పెడుతున్నారని ప్రశ్నించారు. సోషల్ మీడియా వాడని మన తల్లిదండ్రులు, పెద్దవారికి దేశంలో అసలు ఏం జరుగుతుందో తెలియకుండా టీవీ ఛానెళ్లు నిజాన్ని దాచిపెడుతున్నాయని అన్నారు.