తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో రబీ సీజన్‌కు సంబంధించి అదనంగా వడ్లు కొనుగోలు చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇప్పటికే ఉన్న కొనుగోలు లక్ష్యానికి అదనంగా... మరో 8 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో సవరించిన వరి కొనుగోలు అంచనా బియ్యం రూపంలో 35 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి ఏకంగా 43 లక్షల మెట్రిక్ టన్నులకు (LMT) చేరింది. కేంద్రం తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో రాష్ట్ర ధాన్యం రైతులకు పెద్ద ఎత్తున ఊరట లభించనుంది.
మరోవైపు తెలంగాణ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని పెంచినందుకు గానూ... ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
