బెంగళూర్: గాయం కారణంగా ఐపీఎల్ ప్రారంభ మ్యాచులకు సీఎస్కే మాజీ కెప్టెన్ ధోనీ దూరమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ధోనీ హెల్త్ కండిషన్ ఎలా ఉంది..? గాయం నుంచి కోలుకున్నాడా లేదా..? తిరిగి గ్రౌండ్లో ఎప్పుడూ అడుగు పెడతాడని అభిమానుల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ధోనీ గాయంపై చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బిగ్ అప్డేట్ ఇచ్చాడు.
గాయం నుంచి ధోనీ నెమ్మదిగా కోలుకుంటున్నాడని, త్వరలోనే తిరిగి వస్తాడని చెన్నై అభిమానులకు శుభవార్త చెప్పాడు.
కాగా, ధోనీ పిక్క గాయం నుంచి కోలుకుంటుండటంతో ఐపీఎల్ మొదటి రెండు వారాల పాటు ఆటకు దూరమయ్యే అవకాశం ఉందని సీఎస్కే ధృవీకరించిన విషయం తెలిసిందే. ఈ సీజన్ ను చెన్నై పేలవంగా ఆరంభించింది. ఆడిన రెండు మ్యాచుల్లో ఓటమి పాలైంది. దీంతో ధోనీ తిరిగా రావాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.
►ALSO READ | IPL 2026: బ్యాటింగ్ లో దుమ్మురేపిన సాల్ట్, కోహ్లీ, పడిక్కల్.. 10 ఓవర్లకి ఆర్సీబీ స్కోర్ ఎంతంటే?
ఇక, ఈ మ్యాచులో టాస్ ఓడిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్కు దిగింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 18 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్ బాది 28 రన్స్ చేసి ఔట్ అయ్యాడు. పడిక్కల్ (50) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఓపెనర్ సాల్ట్ 46 రన్స్ చేశాడు. ప్రస్తుతం కెప్టెన్ పటిదార్ (30), టిమ్ డేవిడ్ (2) క్రీజులో ఉన్నారు. మ్యాచ్ మొదట్లో రాణించిన చెన్నై బౌలర్లు తర్వాత తేలిపోయారు. బెంగళూర్ బ్యాటర్లు సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడటంతో ఆర్సీబీ భారీ స్కోర్ దిశగా సాగుతోంది.
