IPL 2026: బ్యాటింగ్ లో దుమ్మురేపిన సాల్ట్, కోహ్లీ, పడిక్కల్.. 10 ఓవర్లకి ఆర్సీబీ స్కోర్ ఎంతంటే?

IPL 2026: బ్యాటింగ్ లో దుమ్మురేపిన సాల్ట్, కోహ్లీ, పడిక్కల్.. 10 ఓవర్లకి ఆర్సీబీ స్కోర్ ఎంతంటే?

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న హై-వోల్టేజ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి అద్భుతమైన ఆరంభం లభించింది. విరాట్ కోహ్లీ– ఫిల్ సాల్ట్ మధ్య నెలకొన్న 37 పరుగుల భాగస్వామ్యాన్ని అన్షుల్ కాంబోజ్ బ్రేక్ చేశాడు. కాంబోజ్ బౌలింగ్ (4.3)లో బంతికి భారీ షాట్ ఆడిన కోహ్లీ బౌండరీ లైన్ దగ్గర శివమ్ దూబేకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కి చేరుకున్నాడు. 

అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన దేవదత్ పడిక్కల్ తో కలిసి ఫిల్ సాల్ట్ ఆర్సీబీ స్కోర్ బోర్డుని ముందుకు నడిపించాడు. హాఫ్ సెంచరీ చేసే దిశగా ప్రయణిస్తున్న అతడ్ని చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ శివమ్ దూబే బౌలింగ్ (10.4) లో నూర్ అహ్మద్ కి క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. దీంతో 93 పరుగులకే ఆర్సీబీ రెండు వికెట్లను కోల్పోయింది. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన కెప్టెన్ రజత్ పాటిదార్, పడిక్కల్ కలిసి పరుగుల వరద పారించారు. ముఖ్యంగా దేవదత్ 11వ ఓవర్లో ఏకంగా రెండు భారీ సిక్సులు కొట్టడంతో బెంగళూరు 100 పరుగుల క్రాస్ చేసింది.

ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ మ్యాచులో పలు తప్పిదాలు కూడా చేసింది. రెండు క్యాచ్ లని డ్రాప్ చేయడంతో పాటు ఫీల్డింగ్ లో బంతిని వదిలి పెట్టడంతో భారీ మూల్యం చెల్లించుకుంది. దీంతో ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ 2 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. చైన్నై బౌలర్లలో కాంబోజ్, దూబే చెరో వికెట్ తీసుకున్నారు.