యాపిల్, 7 వేల కోట్లు కట్టు!

యాపిల్, 7 వేల కోట్లు కట్టు!

యాపిల్ ను 18 ఏళ్ల స్టూడెంట్ కోర్టు కీడ్చాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు 7వేల కోట్లకు (వంద కోట్ల డాలర్లు) పరువు నష్టం కేసువేశాడు. ఎందుకో తెలుసా.. కంపెనీ ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్​వేర్ .. తనను చేయని నేరంలో ఇరికించిందని. ఆ స్టూడెంట్ పేరు ఔస్మానీ బాహ్ . ఉండేది న్యూయార్క్‌‌‌‌లో . గత ఏడాది నవంబర్ లో యాపిల్ స్టోర్ లోదొంగతనం చేశాడంటూ నేరం మోపి.. అతడిని అరెస్ట్​ చేశారు. ఆ అరెస్ట్​ వారెంట్ కు అతడి ఫొటోనూ జతచేశారు. కానీ, ఆ ఫొటోలో ఉన్న పోలికలకు, తనకుఏ మాత్రం పొంతన లేదనేది బాహ్ వాదన. జూన్ లోబోస్టన్ లోని స్టోర్ లో దొంగతనం చేశావంటూ తననుబుక్ చేశారని, కానీ, అదే రోజు మన్ హాటన్ లోని సీనియర్ తో కలిసున్నానని అతడు చెప్పాడు.

గతంలో ఫొటోలేని తన లెర్నర్స్​ పర్మిట్ పోయిందని, దాంతోనే దొంగ యాపిల్ స్టోర్ లో చోరీ చేసి ఉంటాడని ఆవేదనచెందాడు. అందువల్లే యాపిల్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ లో దొంగ ఫేస్ కు బదులుగా తన ముఖంచూపించి ఉంటుందని అన్నాడు. ఇదొక్కటే కాదని, ఇంతకు ముందు అలాంటి దొంగతనం అపవాదులను ఎన్నో ఎదుర్కొన్నానని, జవాబు చెప్పలేక తంటాలు పడ్డానని, ఒత్తిడి, కష్టాలు ఎదుర్కొన్నానని బాహ్ చెప్పాడు. తన మానసిక క్షోభకు కారణం కంపెనీనేఅని, అందుకే పరువు నష్టం దావా వేశానని తెలిపాడు. యాపిల్ తో పాటు సెక్యూరిటీ ఇండస్ట్రీ స్పెషలిస్స్ట్ అనే సెక్యూరిటీ సంస్థపైనా అతడు కేసు వేశాడు. మన్ మాన్హాటన్ లోని డిస్ట్రిక్ట్​ కోర్టులో కేసు నడుస్తోంది.