16మంది చావుకు కారణమైన వ్యక్తి అరెస్ట్

16మంది చావుకు కారణమైన వ్యక్తి అరెస్ట్

ఇగో మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఓనర్ భిండేను ముంబై పోలీసులు క్రైమ్ బ్రాంచ్ సెర్చ్ ఆపరేషన్ చేసి అరెస్ట్ చేశారు. ముంబైలోని ఘాట్‌కోపర్‌లో కూలిపోయిన బిల్‌బోర్డ్‌ను ఇన్‌స్టాల్ చేసిన భవేష్ భిండేని అరెస్ట్ చేశారు. గురవారం రాత్రి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ లో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ముంబైకి తీసుకువచ్చారు. శుక్రవారం భిండేని కోర్టులో హాజరుపరచనున్నారు.

ఈదురు గాలులకు భారీ హోర్డింగ్ కూలిపోవడం వల్ల 16 మంది చనిపోగా.. 75 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం గురించి తెలియగానే భిండే తన కారు డ్రైవర్ తోపాటు పారిపోయాడు. ముంభై క్రైం బ్రాంచ్ పోలీసులు భిండే ఫోన్ లొకేషన్ ట్రాక్ చేసి అతన్ని పట్టుకున్నారు. ఆ ప్లేస్ లో హోర్డింగ్ పెట్టడానికి పర్మిషన్ లేదు.. అయినా కూడా రైల్వే పోలీసుల ఆధీనంలో ఉన్న ప్లేస్ లో అక్రమంగా బిల్ బోర్డ్ పెట్టారు. గత కొద్దిరోజుల క్రితం ముంభైలో కురిసిన భారీ వర్షాలకు 120 అడుగులున్న హోర్డింగ్ ఒక్కసారిగా కూలీపోయింది. దాని కిందపడి 16మంది మృతిచెందారు.