కర్నూల్ జిల్లాలో గంజాయి కలకలం.. ఏకంగా దేవాదాయ శాఖ భూమిలోనే పండిస్తున్నరు..!

కర్నూల్ జిల్లాలో గంజాయి కలకలం.. ఏకంగా దేవాదాయ శాఖ భూమిలోనే పండిస్తున్నరు..!

అమరావతి: కర్నూల్ జిల్లాలో గంజాయి సాగు కలకలం రేపింది. గుట్టు చప్పుడు కాకుండా పొలంలో గంజాయి పండిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. చిప్పగిరి మండలం డేగలగూడు గ్రామంలో శివయ్య అనే వ్యక్తి సర్వే నెం.176లోని 30 ఎకరాల దేవాదాయశాఖ భూమిలో పంటలు పండిస్తున్నాడు. 

18 ఎకరాల కంది, మిరప సాగు చేస్తున్న శివయ్య.. అంతర్ పంటగా 12 ఎకరాల్లో గంజాయి సాగు చేస్తున్నాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం (డిసెంబర్ 19) రైడ్ చేశారు. 12 ఎకరాల్లో గంజాయి పంటను గుర్తించి తొలగించారు. ఈ మేరకు నిందితుడు శివయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.