హైదరాబాద్ లో భారీ చోరీ జరిగింది. జీతాలివ్వలేక మూతపడిన సూపర్ మ్యాక్స్ బ్లేడ్ కంపెనీలో దాదాపు మూడు కోట్ల రూపాయల విలువైన సామాగ్రి మాయం అయ్యింది. కుత్బుల్లాపూర్ పరిధిలోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఈ చోరీ జరిగింది. మిషనరీతో పాటు ఇతర సామాగ్రి గురైనట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
సూపర్ మ్యాక్స్ బ్లేడ్ కంపెనీ గత రెండు ఏళ్ళు గా మూత పడి ఉంది. జీతాలు ఇవ్వకపోవడంతో కంపెనీ మూతపడింది. ఆ తర్వాత కంపెనీని బ్యాంక్ టేక్ ఓవర్ చేసుకుంది. అయితే కొన్ని సర్టిఫికెట్ల కోసం శుక్రవారం (డిసెంబర్ 19) కంపెనీ దగ్గరకు వచ్చిన కంపెనీ ప్రతినిధులు.. మిషనరీ మాయం అవ్వటం చూసి షాకయ్యారు.
కంపెనీలో మిషనరీ కనిపించకపోవడంతో దొంగతనానికి గురైనట్లు భావిస్తున్నారు. దీంతో జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం బ్యాంకు ఆధీనంలో కంపెనీ ఉండడంతో వారిచ్చే కంప్లైంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్న జీడిమెట్ల పోలీసులు తెలిపారు.
