తమిళనాడులో SIR పూర్తి.. కోటి మంది ఓటర్లను తొలగించిన ఈసీ.. ఒక్క చెన్నైలోనే 15 లక్షల ఓటర్లు ఔట్

తమిళనాడులో SIR పూర్తి.. కోటి మంది ఓటర్లను తొలగించిన ఈసీ.. ఒక్క చెన్నైలోనే 15 లక్షల ఓటర్లు ఔట్

కొన్ని రాష్ట్రాలు ఎంత వ్యతిరేకిస్తున్నా ఎన్నికల సంఘం సైలెంట్ గా SIR (ఓటర్ల జాబితా సవరణ) ప్రక్రియను పూర్తిచేసుకుంటూ వెళ్తోంది. ఇప్పటికే బీహార్ వంటి రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాను సవరించిన కేంద్రం ఎన్నికల సంఘం.. ఆ తర్వాత వెస్ట్ బెంగాల్, తమిళనాడు వంటి కీలక రాష్ట్రాలపై ఫోకస్ చేసింది. అందులో భాగంగా తమిళనాడులో చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తి చేసిన ఈసీ.. తుది జాబితాకు సంబంధించిన డ్రాఫ్ట్ ను  డిసెంబర్ 19న ప్రకటించింది.

ఈసీ విడుదల చేసిన డేటా ప్రకారం.. 97 లక్షల ఓటర్లను తొలగించింది. ఇందులో 26.94 లక్షల మంది మృతి చెందిన వారి జాబితా కాగా, 66.44 లక్షల ఓటర్లు స్థలం మారినట్లు పేర్కొంది. మరో 3.39 లక్షల ఓటర్లు వివిధ ప్రాంతాల్లో నమోదైనట్లు తెలిపింది. దీంతో దాదాపు కోటి ఓటర్లను జాబితా నుంచి తొలగించింది ఈసీ. 

►ALSO READ | ఇండియాతో పెట్టుకుంటే ఇట్లుంటది మరీ..! ప్రజలు చచ్చిపోయేలా ఉన్నరంటూ పాక్ ఉప ప్రధాని మొసలి కన్నీళ్లు

SIR ప్రక్రియ పూర్తయిన తర్వాత తమిళనాడులో మొత్తం ఓటర్ల సంఖ్య 5.43 కోట్లుగా ఉంది. అందులో 2 కోట్ల 66 లక్షల మంది పురుషులు, 2 కోట్ల 77 లక్షల మంది మహిళలు, 7 వేల 191 ట్రాన్స్ జెండర్లు ఉన్నట్లుగా పేర్కొంది. ఓటర్ల ప్రక్రియకు ముందు 2025 అక్టోబర్ 27 నాటికి 6 కోట్ల 41 లక్షల మంది ఉండగా.. ప్రస్తుత లెక్కల ప్రకారం 5 కోట్ల 43 లక్షలకు చేరుకుంది. ఇక చెన్నైలో ఏకంగా 14 లక్షల 25 వేల ఓటర్లను తొలగించింది ఈసీ.