టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐదో టీ20లో విధ్వంసకర ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. శుక్రవారం (డిసెంబర్ 19) అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో సఫారీ బౌలర్లపై చెలరేగుతూ 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఆడిన తొలి బంతికే సిక్సర్ బాది ఇన్నింగ్స్ ను దూకుడుగా ఆరంభించాడు. ఆ తర్వాత కూడా పాండ్య అగ్రెస్సివ్ గా ఆడాడు. తొలి 7 బంతుల్లోనే బౌండరీల వర్షం కురిపించి 31 పరుగులు చేశాడు. ఓవరాల్ గా 25 బంతుల్లోనే 63 పరుగులు చేసి సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. పాండ్య ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి.
ఈ మ్యాచ్ లో పాండ్య ఇన్నింగ్స్ చూడడానికి తన గర్ల్ ఫ్రెండ్ మహిక శర్మ స్టేడియానికి వచ్చింది. పాండ్య 14 ఓవర్లో వరుసగా 4,6,6,4 బాది చివరి నాలుగు బంతుల్లోనే 20 పరుగులు రాబట్టాడు. ఈ ఓవర్ ముగిసిన తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ కు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి తన సెలెబ్రేషన్ చేసుకున్నాడు. పాండ్య ఫ్లైయింగ్ కిస్ చూసిన మహైక అదే స్టయిల్లో స్పందించింది. ఆమె కూడా పాండ్య బ్యాటింగ్ కు ఫిదా అయ్యి సంతోషంతో రిటర్న్ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Hardik Pandya's flying kiss steals the show!
— Yash MSdian ™️ 🦁 (@itzyash07) December 19, 2025
Spotted with girlfriend Mahieka Sharma cheering wildly from the stands – goals! 💗#HardikPandya #INDvSA
pic.twitter.com/TzW1RxZePm
ఈ మ్యాచ్ విషయానికి వస్తే హార్దిక్ పాండ్య (25 బంతుల్లో 63: 5 ఫోర్లు, 5 సిక్సులు) అసాధారణంగా రెచ్చిపోతూ 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయడంతో పాటు తిలక్ వర్మ (42 బంతుల్లో 73: 10 ఫోర్లు, సిక్సర్) మెరుపు హాఫ్ సెంచరీ చేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. తిలక్ వర్మ 72 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కార్బిన్ బాష్ రెండు.. లిండే, బార్ట్ మాన్ తలో వికెట్ పడగొట్టారు.
