నిర్మల్ జిల్లాలో కొత్త సర్పించి వినూత్న వేషధారణతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. గెలిచిన మరుసటి రోజే ఎలుగు బంటి వేషం వేసి తిరుగుతూ కనిపించడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇదేంటి.. సర్పించి ఈ వేషం వేయటమేంటని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. దీని వెనుక పెద్ద స్టోరే ఉంది. అదేంటో తెలుసుకుందాం.
ఎన్ని్కల్లో గెలిచేందుకు ఒక్కొక్కరు ఒక్కో హామీ ఇస్తుంటారు. గెలిచిన వెంటనే అమలు చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. కొందరు ఇవ్వని హామీని కూడా అమలు చేస్తుంటారు. నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ గ్రామ సర్పించి కూడా కొత్త అవతారం ఎత్తి ఆశ్చర్యానికి గురిచేశాడు. దీనికి కారణం ఊర్లో ఉన్న కోతుల బెడద.
కోతులను తరిమికొట్టేందుకు సర్పంచ్ ఎలుగుబంటిగా మారాడు. లింగాపూర్ గ్రామంలో సర్పంచ్ గా ఎన్నికైన కుమ్మరి రంజిత్.. ప్రజలకు కోతుల బారి నుండి కాపాడేందుకు ఎలుగు బంటి వేషధారణలో దర్శనమిచ్చాడు.
గత మూడు సంవత్సరాలు గా కోతుల నుండి ఇబ్బందులు పడుతున్నారు గ్రామ ప్రజలు. తలా 50 రూపాయల చొప్పున జమచేసి కోతులు పట్టేవారికి ఇచ్చి తరుమే ప్రయత్నం చేశారు. అయినా అవి పోవడం లేదని ఈ ఉపాయం ఆలోచించాడు. యూట్యూబ్ లో చూసి ఎలుగుబంటి వేషధారరణతో కోతులను తరుముతున్నాడు సర్పంచ్. కోతులను తరిమేందుకు సర్పంచ్ చేస్తున్న పనికి గ్రామస్తులు అభినందిస్తున్నారు.
