అభివృద్ధి కోసం కాంగ్రెస్ కు ఓటేయండి : మంత్రి వివేక్ వెంకటస్వామి

అభివృద్ధి కోసం కాంగ్రెస్ కు ఓటేయండి : మంత్రి వివేక్ వెంకటస్వామి
  • చెన్నూరులో మంత్రి వివేక్​వెంకటస్వామి ప్రచారం
  •     బీఆర్ఎస్​ను వీడి మంత్రి సమక్షంలో పలువురు కాంగ్రెస్​లో చేరిక

కోల్​బెల్ట్/చెన్నూరు, వెలుగు: సంక్షేమ పథకాలు అందించే సత్తా ప్రజా ప్రభుత్వానికి మాత్రమే ఉందని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్​అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బుధవారం చెన్నూరు మున్సిపాలిటీలోని 1,2,3,4,6,9,10, 16,17,18 వార్డుల కాంగ్రెస్​ అభ్యర్థులు శ్రీరాంబట్ల రాణి, పెద్దింటి పద్మ, అంబటి శంకర్, పెండ్యాల సాగర్​, నాయకపు వినయ్ కుమార్, సుద్దపల్లి సునీత, నీలం శ్రీనివాస్, సాధనబోయిన లావణ్య, అజీమోద్దీన్, నవాజోద్దీన్ తరఫున మంత్రి ప్రచారం చేశారు. చెన్నూరు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కాంగ్రెస్​కు ఓటేయాలని ఓటర్లను అభ్యర్థించారు. అంతకు ముందు ఆయన గంగారోడ్​లోని ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేశారు.

గౌడ కులస్తులు, లీడర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 6వ వార్డులోని బీఆర్ఎస్​ నేత ఉండ్రాలా పోచం(ఎరుకల పోచం) తన అనుచరులతో, 17వ వార్డు ఇండిపెండెంట్​అభ్యర్థి గుజార్ చరణ్ సింగ్​తోపాటు కిరణ్ సింగ్, కిషన్ సింగ్ సహా వంద మంది నేతలు మంత్రి సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్​కుమార్, కాంగ్రెస్ ​లీడర్లు పాల్గొన్నారు.