సమయపాలన పాటించకుంటే చర్యలు :  కలెక్టర్ కె.హరిత

సమయపాలన పాటించకుంటే చర్యలు :  కలెక్టర్ కె.హరిత
  •     కలెక్టర్ కె.హరిత

ఆసిఫాబాద్, వెలుగు: విధుల్లో సమయపాలన పాటించని అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఆసిఫాబాద్​ కలెక్టర్ కె.హరిత హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్​లోని పలు ప్రభుత్వ శాఖల కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అబ్కారీ, మధ్య నిషేధ, పౌరసరఫరాలు, వ్యవసాయ, భూగర్భ జల, మత్స్య, వైద్య ఆరోగ్య, విద్య, భూ కొలతల శాఖల కార్యాలయాలను పరిశీలించారు.

అధికారులు, సిబ్బంది రిజిస్టర్లను చూసి గైర్హాజరైన వారి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు సకాలంలో అందాలంటే అధికారులు, సిబ్బంది విధుల్లో సమయపాలన పాటించాలని, చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలన్నారు. సమయానికి విధులకు హాజరుకాని సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.