హైదరాబాద్ బుక్ ఫెయిర్ గ్రాండ్ గా ప్రారంభం అయ్యింది. NTR స్టేడియంలో 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను డిసెంబర్ 19న ప్రారంభించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇవాళ్టి నుంచి పది రోజుల పాటు బుక్ ఫెయిర్ కార్యక్రమం కొనసాగనుంది. 17 రాష్ట్రాలకు చెందిన 13 భాషల పుస్తకాలు రీడర్స్ కోసం అందుబాటులోకి తెచ్చారు. మొత్తం368 స్టాల్స్ లో బుక్స్ ను ఏర్పాటు చేశారు.
బుక్ ఫెయిర్ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 9 గంటల వరకు పాఠకుల సందర్శన కోసం అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి జూపల్లి కృష్ణారావు.. గత 38 ఏళ్లుగా ఈ కార్యక్రమం కొనసాగడం గొప్పవిషయమని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి జిల్లాకు, ప్రతి మండలానికి వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
►ALSO READ | నిజామాబాద్ జిల్లాలో దొంగ నోట్ల కలకలం.. ఏకంగా బ్యాంకుకే పట్టుకుపోయిన వ్యక్తి
పేదరికం అడ్డుకాదు..ప్రపంచ చరిత్రలో గొప్ప వాళ్ళు అంతా... మూడు రోజులు పని చేసి... మిగతా రోజులు చదువుకున్నారు. ప్రతి ఇల్లు లైబ్రరీ గా మారాలి.. పుస్తకం కొనటం పెద్ద ఖర్చు కాదు... ఒక ఫుల్ బాటిల్ ఖర్చు కాదు.. పుస్తకాలపై ఇన్వెస్ట్ చేయాలని.. జ్ఞానం పెంచుకోవాలని ఆయన సూచించారు.
బుక్ ఫెయిర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం, లైబ్రరీస్ కార్పొరేషన్ చైర్మన్ రియాజ్, రామచంద్ర మూర్తి, బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షులు యాకుబ్, సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
